

ఐపీఎల్ గురించి టీమిండియా మాజీ క్రికెట్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్‌తో స్పిన్ అనే కళకు తీవ్రమైన నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ధనాధన్ ఫార్మాట్లో బ్యాటర్లకు అనుకూలంగా పిచ్‌లు రూపొందిస్తుండటం వల్ల స్పిన్నర్లు వికెట్లు తీయడం కంటే.. రన్స్ ఇవ్వకుండా ఉండేందుకే బౌలింగ్ వేస్తున్నారు. ఎటాకింగ్ బౌలింగ్ వేయలేకపోతున్నారు. స్లోగా బౌల్ చేసి.. వికెట్లు తీయకుండా.. ఫాస్ట్ బౌలర్లలో స్నిన్నర్లు మారిపోతున్నారు.. బాల్‌ను వేగంగా విసిరేస్తున్నారంటూ భజ్జీ అభిప్రాయపడ్డాడు.
బ్యాటింగ్‌కు ఫేవర్‌గా మారుతున్న పరిస్థితుల కారణంగా.. స్పిన్నర్లు పరిమిత పాత్ర పోషించాల్సి వస్తోంది. వైట్-బాల్ ఫార్మాట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పరిగణించబడే రషీద్ ఖాన్ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ కూడా గత సీజన్లో సరిగ్గా వికెట్లు తీయడంలో ఇబ్బంది పడ్డాడు. ఈ ధోరణి స్పిన్ బౌలింగ్ కళకు హానికరమని హర్భజన్ హెచ్చరించాడు. ఐపీఎల్లో చాలా మంది స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్ల లాగా బౌలింగ్ చేస్తున్నారని చెప్పడానికి నాకు బాధగా ఉంది. వారు బంతిని తిప్పడం లేదు. ఎటాకింగ్ బౌలింగ్ చేసి, వికెట్లు తీయాలనే ఉద్దేశ్యం వారికి లేదు.
స్పిన్నర్లు కొంచెం ధైర్యంగా ఉండాలి, అవకాశాలు తీసుకోవాలి. బాల్‌ను స్పిన్ చేయాలి, ఫ్లైట్ చేయాలి, ఛాన్సెస్ తీసుకోవాలి అంటూ భజ్జీ పేర్కొన్నాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో బాల్‌పై సాలివా వాడకంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తేసిన విషయం తెలిసిందే. ఇది కాస్త స్పిన్నర్లకు హెల్ప్ చేస్తుంది. కోవిడ్ 19 సమయంలో బాల్‌పై ఉమ్ము లేదా లాలాజలం పోయడాన్ని బీసీసీఐ, ఐసీసీ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాన్ ఎత్తివేయడాన్ని హర్భజన్ స్వాగతించాడు. ఇది పేసర్లు, స్పిన్నర్లు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నాడు.