
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ బౌలర్ మతీష పతిరణ ఓ తమిళ సీరియల్ నటితో ప్రేమలో ఉన్నాడనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. తమిళ మీడియా ఈ రూమర్స్‌ను హాట్ టాపిక్‌గా మారుస్తోంది. మార్చి 22న ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంకానుండగా, అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ప్రాక్టీస్ క్యాంప్‌లను ప్రారంభించాయి. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ముందుగానే చెపాక్ మైదానంలో కఠినమైన ప్రాక్టీస్ షురూ చేసింది. మార్చి 23న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా సీఎస్కే తమ టైటిల్ వేటను మొదలుపెట్టనుంది.
శ్రీలంక పేసర్ మతీష పతిరణ, తన యునీక్ యాక్షన్‌తో లసిత్ మలింగా శైలిని పోలి ఉంటాడు. మహేంద్ర సింగ్ ధోనీ పర్యవేక్షణలో పతిరణ ఓ వరల్డ్ క్లాస్ బౌలర్‌గా ఎదిగాడు. ఒత్తిడిలోనూ అద్భుతమైన బౌలింగ్ చేయడం, కీలకమైన సందర్భాల్లో వికెట్లు తీయడం పతిరణ ప్రత్యేకత. దీంతో తమిళనాడు క్రికెట్ అభిమానుల్లో అతనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అతనికి ఎక్కువగా ఉన్నారని చెబుతారు.
తమిళ సీరియల్ ‘భాగ్యలక్ష్మి’ నటి నేహా మీనన్ తో పతిరణ ప్రేమలో ఉన్నాడని గత కొంతకాలంగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేహా మీనన్ ఇటీవల ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేయగా, అది నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోపై నెటిజన్లు ట్రోలింగ్ కూడా చేశారు. అదే సమయంలో “నేహా మీనన్, మతీష పతిరణ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి”. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని, నేహా ఐపీఎల్ 2025లో చెపాక్ స్టేడియం కు రావచ్చని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అయితే, ఈ వార్తలపై నేహా మీనన్ క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేస్తూ, తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరింది. “నేను ఎలాంటి క్రికెటర్ లేదా హీరోతో రిలేషన్లో లేను” అని నేహా స్పష్టంగా చెప్పినప్పటికీ, అభిమానులు మాత్రం నమ్మడం లేదు.
ఇప్పటివరకు 20 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పతిరణ 34 వికెట్లు తీసుకున్నాడు. 2023 సీజన్లో CSK టైటిల్ గెలిచినప్పుడు అతను కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీయడంతో అతనికి స్పెషల్ గుర్తింపు లభించింది. కానీ, 2024 సీజన్లో గాయం కారణంగా 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడి, టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. అతని గైర్హాజరీ సీఎస్కే విజయావకాశాలను దెబ్బతీసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..