
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చరిత్రలో నిలిచిపోయే ఘనతను సాధించాడు. తన విశిష్టమైన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ, టీ20 క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఈ అద్భుత ఘనతను సాధించి, కోహ్లీ తన స్థిరమైన ఆటతీరుతో పాటు, నైపుణ్యం, పట్టుదల, ఫిట్నెస్ను మరోసారి నిరూపించాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 17 పరుగులు చేసిన తరువాత 13000 పరుగుల మార్క్‌ను చేరాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని అందుకున్న ఐదవ ఆటగాడు కావడం విశేషం. అంతేకాదు, అతను 386వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించి, ప్రపంచంలో రెండవ వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. అతని ముందు ఈ రికార్డును కరీబియన్ స్టార్ క్రిస్ గేల్ 381 ఇన్నింగ్స్‌లలో 13000 పరుగుల మైలురాయిని చేరాడు. గేల్ తన కెరీర్‌ను 14562 పరుగులతో ముగించాడు.
13000 పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీతో పాటు అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కీరాన్ పొలార్డ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. అలెక్స్ హేల్స్ 474 ఇన్నింగ్స్‌లలో 13610 పరుగులు చేయగా, షోయబ్ మాలిక్ 487 ఇన్నింగ్స్‌లలో 13557 పరుగులు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్‌కు ఐకాన్ ప్లేయర్‌గా పేరు గడించిన కీరాన్ పొలార్డ్ తన కెరీర్లో 13537 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఉన్న ఐదుగురు ఆటగాళ్లూ తమ తమ దేశాల తరపున, లీగ్‌ల్లో ఎన్నో మ్యాచ్‌ల్లో భాగస్వామ్యం అయ్యారు.
విరాట్ కోహ్లీ ప్రస్తుత వయస్సు 36 సంవత్సరాలు. అయినా అతని ఆటతీరులో క్షణమైనా తగ్గుదల కనిపించడం లేదు. వైట్-బాల్ క్రికెట్లో అతను ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్లలో ఒకడిగా నిలుస్తున్నాడు. RCB తరపున ఐపీఎల్లో కొనసాగుతున్న కోహ్లీ, తన కెరీర్‌ను నిలకడగా నడిపిస్తూ, యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. 13000 పరుగుల ఘనతతో మరోసారి కోహ్లీ తన ఆటలో ఒదిగిన పరిపక్వతను ప్రపంచానికి చాటిచెప్పాడు.
ఈ గొప్ప రికార్డు కేవలం సంఖ్యల పరంగా మాత్రమే కాదు, కోహ్లీ వేసిన పయనానికి ప్రతీకగా నిలుస్తుంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేయడం అంటే ఆటగాడి స్థిరత, ఆటపై మక్కువ, ఫిట్నెస్, మానసిక స్థైర్యానికి నిదర్శనం. విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ప్రతిసారి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాడు. ఎప్పటికప్పుడు తన ఆటను అప్డేట్ చేసుకుంటూ, టెక్నిక్, టెంపరమెంట్‌ను మెరుగుపరచుకుంటూ ప్రపంచ క్రికెట్లో అత్యున్నత స్థానాన్ని సాధించాడు. అతని 13000 పరుగుల మైలురాయి, భారత క్రికెట్‌కు ఒక గర్వకారణంగా మాత్రమే కాక, యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..