
ఈ సీజన్లో జట్టు బాధ్యతలను ఆర్సీబీ యాజమాన్యం రజత్ పతిదార్‌కు అప్పగించింది. ఇక జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన పతిదార్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. గెలిచిన ప్రతీ మ్యాచ్‌లోనూ పతిదార్ జట్టును ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. నాలుగు మ్యాచుల్లో ఇప్పటి వరకు 150కుపైగా పరుగులు చేయగా.. అందులో రెండు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ పతిదార్ అద్భుతంగా రాణించాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో పతిదార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది.
ఇప్పటి వరకు ఆర్సీబీ 4 మ్యాచ్‌లు ఆడితే మూడింటిలో విజయం సాధించింది. 2024 టైటిల్ విన్నర్ కోల్‌కతా, ఐదుసార్లు టైటిల్ విన్నర్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను తమ హోమ్ గ్రౌండ్లలోనే ఓడించింది. దీంతో ఆర్సీబీ కొనసాగిస్తున్న ఫామ్‌ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇసారి ఆర్సీబీ ఎలాగైనా కప్పు కొడుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆర్సీబీ రాబోయే మ్యాచుల్లోనూ తమ పర్ఫామెన్స్‌ను ఇలాగే కొనసాగిస్తే మాత్రం కప్పు కొట్టడం ఖాయం. చూడాలి మరి ఈ సీజన్లోనైనా ఆర్సీబీ కప్పు కొడుతుందో లేదో?
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..