
Sanju Samson Injury Impact RR Playing XI: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రదర్శన ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏంలేదు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో ఆ జట్టు పూర్తిగా విఫలమైంది. రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 19న జైపూర్‌లో జరగనున్న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో పెద్ద సమస్య తలెత్తింది. ఇప్పటికే జట్టులో విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కెప్టెన్ సంజు శాంసన్ లక్నోతో మ్యాచ్‌లో ఆడటం అసాధ్యం అనిపిస్తుంది. దీనికి కారణం శాంసన్ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడమేనని తెలుస్తోంది.
లక్నోతో జరిగే ప్లేయింగ్ 11 నుంచి సంజు శాంసన్..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కుడిచేతి వాటం స్టార్ బ్యాట్స్‌మన్ శాంసన్ గాయంతో బాధపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని పక్కటెముకలలో నొప్పి వచ్చింది. దీని కారణంగా, శాంసన్ తన ఇన్నింగ్స్‌ను కూడా పూర్తి చేయలేకపోయాడు. గాయం కారణంగా రిటైర్ అయి మైదానం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత, అతను బ్యాటింగ్ చేయడానికి తిరిగి మైదానంలోకి రాలేదు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ సూపర్ ఓవర్లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
ఇది కూడా చదవండి: కాటేరమ్మ కొడుకులమంటూ ఫోజులు.. కట్‌చేస్తే.. 7 మ్యాచ్‌లకే సీన్ రివర్స్.. 300లంటూ కావ్యకే కన్నీళ్లు తెప్పించారుగా
లక్నోతో మ్యాచ్‌కు ముందు, జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ శాంసన్ ఫిట్నెస్ గురించి అప్డేట్ ఇచ్చాడు. అతన్ని స్కాన్ కోసం పంపినట్లు చెప్పుకొచ్చాడు. స్కానింగ్ రిపోర్ట్ ఇంకా రాలేదు. నివేదికల ఆధారంగా, శాంసన్ తదుపరి మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది జట్టు యాజమాన్యం నిర్ణయిస్తుంది.
కెప్టెన్‌గా ఎవరు?
రాబోయే మ్యాచ్‌లో సంజు శాంసన్ ప్లేయింగ్ 11లో భాగం కాకపోతే, జట్టు మరోసారి కెప్టెన్‌ను మార్చాల్సి ఉంటుంది. అతని స్థానంలో, రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహించడాన్ని చూడొచ్చు. ఈ సీజన్ ప్రారంభంలో, రియాన్ మూడు మ్యాచ్‌లలో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్లేయింగ్ 11 లో భాగంగా ఉన్నాడు. వేలికి గాయం కావడంతో శాంసన్ వికెట్ కీపర్‌గా ఫిట్‌గా లేడు. దీంతో రియాన్‌ను భర్తీ చేయాల్సి వచ్చింది. ఈ కాలంలో, రాజస్థాన్ మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచింది.
ఇది కూడా చదవండి: నాడు బ్రహ్మ రాతను మార్చాడు.. నేడు విధి రాతకు బలయ్యాడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లోనే మోస్ట్ ఫ్లాప్ ప్లేయర్‌గా
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..