
IPL 2025లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సాగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో నాలుగేళ్ల తర్వాత..ఈ సీజన్లో జరిగిన తొలి సూపర్ ఓవర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ నెగ్గింది. సూపర్ ఓవర్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేయగా.. 12 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ కేవలం 4 బంతుల్లోనే చేజ్ చేసింది. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (7), స్టబ్స్ (6) పరుగులు చేయడంతో ఢిల్లీ సూపర్ విక్టరీ సాధించింది.
18వ సీజన్లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. 2021 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇక నాలుగేళ్ల తర్వాత మరోసారి సూపర్ ఓవర్ మ్యాచ్ జరగగా అందులోనూ ఢిల్లీనే విజయకేతనం ఎగురవేసింది.
IPL 2025లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠబరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా. 189 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగన రాజస్థాన్ రాయల్స్ చివరి బంతి వరకు పోరాడి188 పరుగులు చేయగలిగింది. ఇరు జట్ల స్కర్లు సమానం కావడంలో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…