
Faf du Plesis May Play Against RCB: అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల పరంపర ఐపీఎల్ (IPL) 2025 సీజన్లో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఓటమిని ఎదుర్కోని ఏకైక జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. ఢిల్లీ మూడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలోనూ గెలిచింది. అయితే, ఢిల్లీ డాషింగ్ ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ గత మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఈ క్రమంలో ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మోట్ అతని గురించి కీలక అప్డేట్ ఇచ్చాడు.
ఫాఫ్ డు ప్లెసిస్‌కి ఏమైంది..
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏప్రిల్ 10న బెంగళూరు మైదానంలో కీలక మ్యాచ్ జరగనుంది. దీని కోసం, గత సీజన్ వరకు ఆర్సీబీ తరపున ఆడిన మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఇప్పుడు ఢిల్లీ జట్టు తరపున ఆడుతున్నాడు. ఫాఫ్ డు ప్లెసిస్ గురించి, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మోట్ మాట్లాడుతూ, అతని ఫిట్నెస్ను ఇంకా అంచనా వేయలేదు. ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు నెట్స్ సమయంలో మాత్రమే అతను ఎంత ఫిట్‌గా ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుత ప్రదర్శన..
దక్షిణాఫ్రికాకు చెందిన డాషింగ్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డు ప్లెసిస్ గురించి చెప్పాలంటే, అతను గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, అతన్ని ఐపీఎల్ 2025 సీజన్ కోసం RCB విడుదల చేసింది. ఆ తరువాత, ఫాఫ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకు అతను అద్భుత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఢిల్లీ తరపున రెండు మ్యాచ్‌ల్లో 79 పరుగులు చేశాడు. ఇందులో ఫీఫ్టీ కూడా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..