
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆశలు అడియాశలయ్యేలా కనిపిస్తున్నాయి. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో బెంగళూరు మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, సొంతగడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. గుజరాత్ టైటాన్స్‌తో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ దారుణమైన ఓటమిని చవిచూసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో దారుణ పరాజయాన్ని చవి చూసింది. దీంతో బెంగళూరు తన ఖాతాలో ఓ చెత్త రికార్డును లిఖించుకుంది. ఒకే మైదానంలో అత్యధిక మ్యాచ్‌లలో ఓడిపోయిన జట్టుగా పరమ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఏప్రిల్ 10న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో, బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 18 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కేఎల్ రాహుల్ ఢిల్లీ తరపున వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 93 పరుగులతో అజేయంగా నిలిచి, జట్టును గెలిపించాడు.
ఇది కూడా చదవండి: IPL 2025: టీమిండియాలో ప్లేస్ కోసం ఖర్చీఫ్ వేసిన ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు.. లిస్ట్‌లో ప్రీతీ ఫేవరేట్
ఒకే వేదికపై అత్యధిక ఓటములు..
ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది వరుసగా సొంతగడ్డపై రెండో ఓటమి. అంతకుముందు గుజరాత్ టైటాన్స్ కూడా ఏకపక్షంగా ఓడిపోయింది. దీంతో బెంగళూరు సొంతగడ్డపై 45వ ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే స్టేడియంలో ఏ జట్టుకైనా ఇదే చెత్త రికార్డు. ఆసక్తికరంగా, ఈ ఓటమికి ముందు, ఢిల్లీ, బెంగళూరు సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. రెండు జట్లు ఒకే మైదానంలో 44 ఓటములను చవిచూశాయి. కానీ, ఇప్పుడు బెంగళూరును ఓడించడం ద్వారా ఢిల్లీ ఈ రికార్డు నుంచి తనను తాను కాపాడుకుంది.
ఇది కూడా చదవండి: Fastest Century in IPL: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే.. టాప్ 5లో ప్రీతి జింటా ప్లేయర్
చరిత్రను మార్చిన ఢిల్లీ..
ఈ ఎడిషన్‌లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈ సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఐపీఎల్ 2025లో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో ఆడడం మొదలుపెడితే ఈ చెత్త రికార్డులోకి తిరిగి రావొచ్చు. ఢిల్లీ జట్టు తన సొంత మైదానంలో 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, ఢిల్లీ అద్భుతమైన ఫామ్‌ను చూస్తే, సొంతగడ్డపై ఓడిపోతుందని చెప్పడం కష్టం. ఈ సీజన్లో ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. జైట్లీ స్టేడియంలో ఢిల్లీ జట్టు తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 13 ఆదివారం ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..