
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పేరును తొలగించనున్నారు. అజహరుద్దీన్ పేరు తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అంబుడ్స్‌మెన్ జస్జిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మెన్ విచారణ జరిపారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో అజహరుద్దీన్ తన పేరును నార్త్ స్టాండ్‌కు పెట్టుకున్నారు. ఆయన పేరును ఆయనే స్టాండ్‌కు పెట్టుకోవడం సరికాదని అంబుడ్స్‌మెన్ నిర్ణయించారు.
అజహర్ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని అంబుడ్స్‌మెన్ తీర్పు చెప్పారు. వెంటనే నార్త్ స్టాండ్‌కు అజహరుద్దీన్ పేరు తొలగించాలని హెచ్‌సీఏను ఆదేశించారు. అలాగే ఇక నుంచి నార్త్ స్టాండ్ టిక్కెట్లపై ఆయన పేరు ప్రస్థావన ఉండొద్దని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతున్న సమయంలో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై అజహరుద్దీన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..