
క్రిస్ గేల్.. అరివీర భయంకరమైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన క్రిస్ గేల్ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాడు. 2013 ఏప్రిల్ 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణె వారియర్స్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో గేల్ 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదేశాడు.