
ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వేల చరిత్ర దాదాపు 200 సంవత్సరాల నాటిది. ప్రస్తుతం ఇది రోజుకు సగటున 12,817 రైళ్లను నడుపుతోంది. దీనితో, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అయిన భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో.. ప్రతిరోజూ రెండు కోట్లన్నర మిలియన్లకు పైగా ప్రజలు ప్రయాణిస్తున్నారని అంచనా. అలాంటి భారతీయ రైల్వేల యాజమాన్యం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. అదనంగా, భారతీయ రైల్వేల నిర్వహణ, నియామకాల ప్రక్రియ అన్ని అంశాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యానికి చోటు లేదు. కానీ, ఇక్కడ చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది.. అదేంటంటే..ఒకప్పుడు ఒక వ్యక్తి కొంతకాలం పాటు సొంత రైలును కలిగి ఉండేవాడు…!
అవును, మీరు చదివింది నిజమే.. పంజాబ్‌కు చెందిన సంపురాన్ సింగ్..సొంత రైలును కలిగి వున్న అదృష్టవంతుడు..! ఈ వ్యక్తికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేని ప్రత్యేక హక్కు ఉంది. దీంతో స్వతంత్ర భారతదేశంలో రైలు కలిగి ఉన్న ఏకైక భారతీయుడిగా ఆయన నిలిచారు. స్వాతంత్ర్యానికి ముందు రాజులు, మహారాజులు అనుభవించిన ఈ ప్రత్యేక హక్కును పొందిన మొదటి వ్యక్తి ఆయన అయ్యాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే…
సమాచారం మేరకు.. లూథియానా, చండీగఢ్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం 2007లో రైతుల నుండి వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ సమయంలో సంపురాన్ సింగ్ తన భూమిని కూడా భారత రైల్వేలకు విరాళంగా ఇచ్చాడు. రైల్వే శాఖ రైతుల నుండి ఎకరానికి రూ.25 లక్షల ధరకు భూమిని కొనుగోలు చేసింది. సంపురాన్ సింగ్ కూడా తన భూమిని అదే ధరకు ఇచ్చాడు. కానీ కొన్ని రోజుల తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ సమీపంలోని పట్టణంలో ఎకరానికి 71 లక్షల రూపాయల ధరకు భూమిని కొనుగోలు చేసిందని తెలుసుకున్న సంపురాన్ సింగ్ షాక్ అయ్యాడు..దీంతో అతను 2015 లో కోర్టుకు వెళ్ళాడు. అక్కడ విజయం సాధించాడు. దీని ప్రకారం, కోర్టు అతనికి రూ.1.47 కోట్లు చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. పరిహారం అందించాలని ఆదేశించారు. అయితే, రైల్వేలు ఇంత డబ్బు చెల్లించడానికి నిరాకరించాయి. ఇంత డబ్బుకు భూమి ఇస్తే రైల్వేలకు నష్టం వాటిల్లుతుందని వాదించారు.
ఇవి కూడా చదవండి
అందువల్ల, రైల్వే శాఖ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును ఆ రైతుకు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అందుకు అంగీకరించిన రైల్వేశాఖ న్యూఢిల్లీ, అమృత్సర్ మధ్య నడిచే రోజువారీ రైలుతో పాటు, లూథియానా రైల్వే స్టేషన్ మాస్టర్ కార్యాలయం యాజమాన్యాన్ని సింగ్‌కు ఇచ్చారు. కానీ, కొంతసమయం తరువాత కోర్టు ఆదేశం మేరకు రైల్వేకు తిరిగి ట్రైన్‌ను తిరిగి ఇచ్చేసింది. ఆ విధంగా సంపురాన్ సింగ్ కేవలం 5 నిమిషాలు మాత్రమే రైలు యజమానిగా ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన కేసు ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా, ఇది భారతీయ రైల్వే చరిత్రలో ఒక ప్రత్యేకమైన సంఘటనగా నమోదు చేయబడింది. అదే సమయంలో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు యజమానిగా సంపురాన్ సింగ్ పేరు చరిత్రలో నిలిచిపోయింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..