India vs South Africa 2nd T20I Result: రెండో టీ20లో దక్షిణాఫ్రికా అందించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. టీం ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితం అయింది. తెలుగబ్బాయ్ తిలక్ వర్మ ఒంటరి పోరాటం వృథాగా మారిపోయింది. హార్దిక్ పాండ్యా 20 పరుగులు, అక్షర్ పటేల్ 21, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 5, అభిషేక్ శర్మ 17, శుభ్మాన్ గిల్ పరుగులు చేయకుండానే ఔటయ్యారు. మార్కో యాన్సన్ రెండు వికెట్లు, లుంగి న్గిడి ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ 90 పరుగులు చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 29, డెవోల్డ్ బ్రెవిస్ 14, డోనోవన్ ఫెర్రీరా 30, డేవిడ్ మిల్లర్ 20 పరుగులు చేశాడు. రీజా హెండ్రిక్స్ 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత్ తరపున 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్ పడగొట్టగా, డి కాక్ రనౌట్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
