
ఆదాయపు పన్ను ఆదా చేసుకునే ప్రయత్నంలో మన దేశంలో చాలా మంది వ్యక్తులు తరచుగా తప్పులు చేస్తారు. దీని వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు నేరుగా మన ఇంటికి నోటీసులు పంపే అవకాశం ఉంది. అన్ని ఆదాయపు పన్ను నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవడంతో పాటించడం చాలా ముఖ్యంమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయాలను వృత్తిపరమైన మార్గదర్శకత్వం లేకుండా నిర్వహించకూడదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను నోటీసులు రాకుండా ఏయే పథకాల్లో పెట్టుబడి పెట్టాలో? చూద్దాం.
ఫిక్స్డ్ డిపాజిట్లు
ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపికగా ఉంటుంది. ఇవి కాలపరిమితి చివరిలో హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. అయితే ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వారికి ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు అందవచ్చు.
పొదుపు ఖాతా లావాదేవీలు
పొదుపు ఖాతాలో లావాదేవీలు నిర్వహించడం సర్వసాధారణం. చాలా మంది మల్టీ అకౌంట్స్‌ను నిర్వహిస్తారు. అయితే ఈ ఖాతాలను నిర్వహించడానికి నియమాలు ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలోపు పొదుపు ఖాతాలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుంది.
ఇవి కూడా చదవండి
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు
ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారింది. తక్కువ వ్యవధిలో గణనీయమైన రాబడిని ఇస్తుంది. అయితే రియల్ ఎస్టేట్‌లో రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు రావచ్చు.
మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారు ఇటీవల కాలంలో చాలా మంది పెరిగారు. ఇందులో పెట్టుబడి దీర్ఘకాలిక రాబడికి సురక్షితమైన ఎంపికగా భావిస్తారు. బాండ్లు, డిబెంచర్లు కూడా అదేవిధంగా కనిపిస్తాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు.
విదేశీ ఆస్తులు
విదేశీ కరెన్సీ కొనుగోలుపై పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను మించి ట్రావెలర్స్ చెక్కులు, విదేశీ కరెన్సీ కార్డులు లేదా డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు వచ్చే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు మరియు జరిమానాలను నివారించడానికి ఈ ఐదు లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..