
ఇమాన్వి.. ఈమె మరో పేరు ఇమాన్ ఇక్బాల్ ఇస్మాయిల్. ఈ ముద్దుగుమ్మ మాజీ పాకిస్తాన్ సైనిక అధికారి కుమార్తె. నటి, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్‌గా ప్రసిద్ధి చెందిన బహుముఖ కళాకారిణి. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. ఇది ఆమెని ఆమెని ఫేమస్ ఇన్ఫ్లుయెన్సుర్ని చేసింది.
ఇమాన్ ఇస్మాయిల్ 20 అక్టోబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీలో జన్మించిన ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. మరో పేరు ఇమాన్వి. అమెరికాలో ఓ ప్రముఖ యూనివర్సిటీ నుంచి MBAలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.
ఇమాన్వి కరాచీకి చెందిన ముస్లిం అమ్మాయి. ఈ ముద్దుగుమ్మ తండ్రి పాకిస్తాన్ దేశ సైనిక అధికారిగా ఉన్నారు. చదువుతున్న రోజుల్లో డ్యాన్స్ పట్ల తన అభిరుచిని కొనసాగించింది. అమెరికాలోని స్థానిక డ్యాన్స్ అకాడమీలో కూడా చేరింది.
వివిధ రకాల డ్యాన్స్‌లు సునాయాసంగా చేయగలదు ఈ వయ్యారి భామ. చాల డ్యాన్స్ కాంపిటీషన్లో కూడా పాల్గొన్నది ఈ క్యూటీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, డ్యాన్సర్‌గా ఇమాన్ సాధించిన విజయం ఆమెకు పరిశ్రమలో అనేక అవకాశాలను తెచ్చిపెట్టింది.
ఈ అందాల తార ప్రతిష్టాత్మక ఈవెంట్లలో ప్రదర్శన ఇవ్వడంతో పాటు ప్రసిద్ధ బ్రాండ్లకు మోడల్‌గా కూడా చేసింది. ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో తొలిసారి హీరోయిన్గా నటిస్తుంది. మొదటి చిత్రంతోనే డార్లింగ్ సరసన నటించే ఛాన్స్ కొట్టింది ఈ బ్యూటీ.