
ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే తాటి ముంజలు తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. ముంజల్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ బి లాంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇది ఎండాకాలంలో వరం లాంటిది. ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. చిన్నపిల్లలు, వృద్ధులకు సైతం తాటి ముంజలు ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా దోహదపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారికి తాటి ముంజలు మందులా పనిచేసత్ఉంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎండాకాలంలో వచ్చే చర్మ వ్యాధులను నివారించడానికి తాటిముంజలు చాలా ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువు తగ్గించే శక్తి తాటిముంజలకు ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తాయి. మలబద్ధకం, విరేచనాల సమస్యలు ఉన్నవాళ్లకు ఇవి చాలా మంచిది.
ముంజలు తినటం వల్ల పేగుల్లోని పుండ్లను కూడా నయం చేస్తాయి. నాలుకపై తరచుగా పుండ్లు వస్తుంటే, రెండు ముంజలను గుజ్జు తీసి మిక్సీలో వేసి రుబ్బుకుని, అందులో కొబ్బరి పాలు కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే అల్సర్ సమస్య తగ్గుతుంది. షుగర్ పేషెంట్లు ముంజలు తింటే రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుందని చెబుతారు. అజీర్తి సమస్య, కాలేయ సమస్య ఉన్నవాళ్లకు ముంజలు తినడం చాలా మంచిది.
ఎండాకాలంలో జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొటిమలు రాకుండా ఉండటానికి తాటిముంజలు తినవచ్చు. మండే ఎండల వల్ల వచ్చే చెమటకాయలు, బొబ్బలు, ఇతర చర్మ సమస్యల నుంచి బయటపడటానికి ముంజలు సహాయపడుతాయి. ఎండాకాలంలో ఎక్కువగా వేధించే చెమటకాయల సమస్యకు సైతం తాటి ముంజలు మంచిది. తాటిముంజల నీటిని చర్మానికి రాస్తే చెమటకాయలు త్వరగా తగ్గిపోతాయి.
గర్భిణీలు ముంజలు తింటే త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే తరచుగా ఎసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి ముంజలు సహాయపడతాయి. బాలింతల్లో తల్లిపాలు బాగా వస్తాయి. అంతేకాకుండా బిడ్డకు పోషకాలు బాగా అందుతాయి. ఆడవారిలో వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది. తాటి ముంజల్లో ఉండే రసాయనంఆడవాళ్లకు వచ్చే రొమ్ము క్యాన్సర్ గడ్డలు రాకుండా అడ్డుకుంటుంది.