
భానుడి భగభగలు రోజురోజుకు పెరిగిపోతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. దీంతో చాలామంది సమ్మర్ డైట్ ఫాలో అవుతున్నారు..వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్న వేళల్లో అత్యవసరమైతే బయటకు వస్తున్నారు. ఇంట్లో చల్లటి పానీయాలు తాగుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. మరోవైపు వేసవి స్పెషల్ తాటి ముంజలను జనం ఇష్టంగా తింటున్నారు.
అసలే మండే ఎండాకాలం.. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎండ దెబ్బతో బాడీ డిహైడ్రేషన్ గురవుతుంటి. అలాంటి సమయాల్లో తాటి ముంజలు తింటే మస్త్ రిలీఫ్ ఉంటుందంటున్నారు సిద్ధిపేట జిల్లా వాసులు. హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ, పొట్లపల్లి గ్రామాల్లో భారీగా తాటి వనాలు ఉన్నాయి. మండే వేసవిలో సూర్యుని భగభగను తట్టుకునేందుకు తాటి ముంజలతో చెక్ పెడుతున్నారు ఇక్కడి స్థానికులు. చిన్నా, పెద్ద తేడా లేకుండా తాటి వనాల్లోకి వెళ్లి తాటి ముంజలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. సహజ సిద్ధంగా ఈ ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటి ముంజలకు భలే డిమాండ్ ఏర్పడింది. ఈ తాటి ముంజల్లో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయని శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయని, బాడిలో ఉన్న హీట్‌ను బాగా తగ్గిస్తుంది అంటున్నారు స్థానికులు. 100 రూపాయలకు డజన్ తాటి ముంజలను అమ్ముతూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు ఇక్కడి గీత కార్మికులు.
చాలామంది ముంజలపై గోధుమ రంగులో ఉండే పొట్టు తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయని, ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..