

హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై అత్యాచార ఘటనలో దర్యాప్తు జరుగుతోంది. ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి కార్లో ఎక్కించుకున్నారు ముగ్గురు యువకులు. మీర్పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర.. సదరు యువతిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పహాడీ షరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది ఆ జర్మనీ యువతి. ముగ్గురు యువకులు తనపై లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసింది.
మీర్పేట్ దగ్గర లిఫ్ట్ ఇస్తామని చెప్పి వాళ్లు కార్ ఎక్కించుకున్నట్టు ఆమె కంప్లైంట్లో వివరించింది. తర్వాత పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు యువకులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బాధితురాలు విదేశీ యువతి కావడంతో కేసును మరింత సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం హాస్పటల్‌కు తరలించారు పోలీసులు.