
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్పేట్ మాధవి మడ్డర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న గురుమూర్తి తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కానీ పోలీసులు మొదట మిస్సింగ్ కేసుగా దీన్ని నమోదు చేశారు . మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చాలి అంటే అనేక ఆధారాలు పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా ఈ కేసులో మాధవి హత్యకు గురి అయినట్టు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో పోలీసులు పలు రకాలుగా ఈ కేసును ప్రూవ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
గతంలో ఇలాంటి కేసులు నమోదు అయిన రాష్ట్రాల నుండి ఎక్స్పర్ట్ టీమ్లను రాచకొండ పోలీసులు సంప్రదించారు. ఇక తాజాగా మన రాష్ట్రంలో ఉన్న ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దింపారు. మృతదేహానికి సంబంధించిన ఎలాంటి ఆనవాలు లభించలేదు. కాబట్టి క్లూస్ టీం కు లభించిన హెయిర్ శాంపిల్ ఆధారంగా డిఎన్ఏ పరీక్షకు పంపించారు. ఒకవేళ అధికారులకు లభించిన డి ఎన్ ఏ శాంపుల్ తో గురుమూర్తి పిల్లల హెయిర్ డిఎన్ఏ ఒకటే అని తేలితే, ఆ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించి గురుమూర్తి పై మర్డర్ కేసును నమోదు చేయనున్నారు.
మరోవైపు ఎఫ్ఎస్ఎల్ అధికారులు మరో టెక్నాలజీని ఉపయోగించి ఆధారాలను సమర్పించనున్నారు. సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా మనిషి కంటికి కనిపించని ద్రవపదార్థాలను సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టవచ్చు. ఎస్ఎస్ఎల్ అధికారులు మీర్పేట్ కేసులో ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే గురుమూర్తి ఇంట్లో రక్తపు మరకలను సేకరించారు. మాధవిని హత్య చేసిన తర్వాత గురుమూర్తి ఇంట్లోనే బాత్రూంలోనే మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత ముక్కలను ఒక బకెట్లో ఉడకబెట్టాడు. శరీర భాగాలు ఉడికించేందుకు వాటిని నీటిలో వేసి వాటర్ హీటర్ పెట్టాడు. ఆ తర్వాత ముక్కలను ఫ్లెష్ చేసి బాత్రూం మొత్తాన్ని పదిసార్లు కడిగాడు. మరికొన్ని శరీర భాగాలను బకెట్ లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు ఇంట్లో నుండి బయటకు వెళ్లిన సీసీ కెమెరా విజువల్ కూడా పోలీసులకు దొరికింది.
అత్యంత అరుదైన కేసుగా రాచకొండ పోలీసులు మీర్పేట్ కేసును పరిగణిస్తున్నారు.. దీంతో కేసుకు సంబంధించిన మరింత ఆధారాల కోసం ఇతర రాష్ట్రాల నుండి ఇదే తరహాలో నమోదైన మర్డర్ కేసులు దర్యాప్తు చేసిన అధికారులను రాచకొండకు పిలిపించారు. వారి సలహాలు సూచనలను సైతం పోలీసులు తీసుకుంటున్నారు. త్వరలోనే కేసు కు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించి నిందితుడు గురుమూర్తికి శిక్షపడేలా చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..