

ఈ మధ్యకాలంలో జంతువులు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లోకి వస్తుండటమే కాదు.. వారికి చిన్న జలక్ ఇస్తూ షాక్కు గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక దౌల్తాబాద్ గ్రామంలో అర్ధరాత్రి రోడ్డుపై భారీ మొసలి హల్చల్ చేసింది. చెరువులో నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలి.. మరోవైపుకు వెళ్తుండగా.. స్థానికులు దాన్ని గమనించారు. అయితే మొసలి ఉన్న రోడ్డుపైకి వాహనం రాగానే అది.. ఠక్కున మళ్లీ చెరువులోకి వెళ్లిపోయింది. ఇక మొసళ్లు ఆ ప్రాంతంలో తరచూ చెరువులో నుంచి రోడ్డుపైకి వస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.