
హైదరాబాద్ ఎస్సార్ నగర్లో గల వినాయక స్వామి గుడిలో శివపార్వతుల విగ్రహాలు కొద్ది రోజుల క్రితం చోరీ అయ్యాయి. దీంతో ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సిసి కెమెరాల ద్వారా ఆలయంలోని విగ్రహాలను ఇద్దరూ మహిళలు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాలు ఆధారంగా పోలీసులు వారిద్దరూ బంజరా హిల్స్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు స్వర్ణలత, పావనిగా గుర్తించారు.
తరచూ తమ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతుండటంతో దోష నివారణకు సోదరీమణులు ఒక బాబా దగ్గరికి వెళ్లారు. దేవుడి పంచలోహ విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని ఆ బాబా సూచనలు చేశాడు. బాబా సూచనల ప్రకారం దేవుని విగ్రహాలను కొనుగోలు చేసేందుకు స్వర్ణలత, పావని ప్రయత్నించారు. అయితే తమ స్థోమతకు మించి ఆ విగ్రహాలు ఖరీదు ఉండటంతో గుడిలోని విగ్రహాలను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఎస్ ఆర్ నగర్లో ఉన్న గణేశ్టెంపుల్కి ఈనెల 8వ తేదీన అక్కా చెల్లెలు ఇద్దరు వెళ్లారు. గర్భగుడిలో ఉన్న శివపార్వతుల విగ్రహాలను చోరీ చేశారు. చోరీ చేసిన విగ్రహాలతో బంజారాహిల్స్‌లో ఉన్న ఎంబిటి నగర్‌కు వచ్చారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఇద్దరినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2018 నుంచి తమ కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతుండటంతో విగ్రహాలు ప్రతిష్ఠించి దోష నివారణ చేయాలని బాబా చెప్పడంతో… దొంగతనం చేసినట్లు పోలీసులకు వారు చెప్పారు.
2018లో స్వర్ణలత, పావనీల సోదరుడు అనారోగ్య కారణంగా మృతి చెందాడు. 2019 జనవరిలో స్వర్ణలత కుమారుడు వివేక్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2019 మేలో పావని భర్త రమణ కొవిడ్తొో చనిపోయాడు. అదే నెలలో వీరి తండ్రి వెంకటరత్నం అనారోగ్య కారణంగా మరణించాడు. ఇలా తరచూ ఘటనలు జరుగుతుండటంతో ఒక బాబాను కలవడంతో.. ఇంట్లో పంచలోహ విగ్రహాలు పెట్టుకోవాలని ఆయన సూచించారు. వీరు అవే కొనే స్థోమత లేక దొంగతనం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..