
ఈ నవజాత శిశువుల ఊపిరితిత్తుల్లోకి పేగులు వచ్చాయి. ఈ అరుదైన వ్యాధిని కంజెంటల్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా అంటారు. ఇలా పుట్టిన శిశువులకు 24 గంటలలోపు ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు. అసలు ఈ వ్యాధిని గుర్తించడం కూడా చాలా కష్టమని తెలిపారు నీలోఫర్ ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రవికుమార్. ఈ వ్యాధితో పుట్టిన శిశువును ఫస్ట్ అవర్లోనే స్టెబిలైజ్ చేసి 24 గంటల్లోపు ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఇలాంటి అరుదైన వ్యాధి వేలల్లో ఒకరికి వస్తుందని తెలిపారు. ఇలా పుట్టిన నలుగురు బేబీలకు శస్త్రచికిత్స చేసి కాపాడినట్టు తెలిపారు. వీరిలో ముగ్గురు త్వరగా రికవరీ అయ్యారని, వారిని డిశ్చార్జ్ చేశామని, మరో శిశువు అబ్జర్వేషన్లో ఉందని, రెండురోజుల్లో ఆ బేబీ కూడా పూర్తిగా కోలుకుంటుందని తెలిపారు. వీరిలో… పది సంవత్సరాలుగా పిల్లలు లేకపోవడముతో ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుని పుట్టిన బేబీ కూడా ఉందని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
జనగామ, కరీంనగర్, నల్లగొండలు చెందిన మహిళలకు పుట్టిన బేబీలు ఈ రకమైన వ్యాధితో పుట్టారని తెలిపారు. వీరితోపాటు మరో బేబీకూడా ఈ వ్యాధితో పుట్టడంతో నలుగురు బేబీలకి సర్జరీ చేసి వారి ప్రాణాలు కాపాడారు. డెలివరీకి వచ్చిన నలుగురు ప్రెగ్నెంట్ మహిళలకు డెలివరీ చేసిన డాక్టర్ నారాయణ, డాక్టర్ స్వప్న, సిబ్బంది.. నీలోఫర్ సూపర్డెంట్ డాక్టర్ రవికుమార్, ఆర్.ఏం.ఓ డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో ఆపరేషన్ను దిగ్విజయంగా పూర్తిచేసినట్లు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…