
హృతిక్ రోషన్.. పేరుకి బాలీవుడ్ హీరో అయినా కూడా తెలుగులోనూ ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. పైగా ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి వార్ 2లో నటిస్తున్నారు కాబట్టి హృతిక్ సినిమాల గురించి మనోళ్లు కూడా ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలోనే వార్ 2 తర్వాత క్రిష్ 4 చేయబోతున్నారు హృతిక్ రోషన్. దీనికి దర్శకుడెవరో కూడా తేలిపోయిందిప్పుడు. హృతిక్ కెరీర్లో ఎన్ని సినిమాలున్నా.. క్రిష్ ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానం ఉంది.
ఈ సిరీస్‌లో వచ్చిన కోయి మిల్ గయా, క్రిష్ 2, క్రిష్ 3 బ్లాక్‌బస్టర్ అయ్యాయి. అందుకే క్రిష్ 4 కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. బడ్జెట్ కారణంగా హోల్డ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు కన్ఫర్మ్ అయింది.
హృతిక్ రోషన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. 25 ఏళ్ళ కింద నిన్ను హీరోగా పరిచయం చేసిన నేను.. ఇప్పుడు దర్శకుడిగానూ పరిచయం చేస్తున్నానంటూ రాకేష్ రోషన్ ట్వీట్ చేసారు.
ఆదిత్య చోప్రాతో కలిసి క్రిష్ 4 నిర్మిస్తున్నారీయన. త్వరలోనే ఈ సినిమా షూట్ షురూ కానుంది. మరి హీరోగా సక్సెస్ అయిన హృతిక్.. దర్శకుడిగానూ తన మార్క్ చూపిస్తారా లేదా అనేది చూడాలిక.