
సాధారణంగా చాలా మందికి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు బరువు తగ్గడానికి, ఉదయాన్నే కడుపుని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరం అనేది కూడా నిజం అంటున్నారు నిపుణులు. పలు రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఉదయం వేడినీరు తాగడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే ఉదయం వేడి నీరు తాగకూడదు..:
కడుపులో పుండు: మీకు కడుపులో పుండు ఉంటే, ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం హానికరం. కడుపులో అధిక ఆమ్లం ఏర్పడటం వల్ల, కడుపు, పేగుల లోపలి గోడపై గాయం ఏర్పడుతుంది. దీనిని అల్సర్ అంటారు. ఈ సందర్భంలో, వేడినీరు తాగడం వల్ల కడుపులో చికాకు, నొప్పి కలిగిస్తుంది. అలాగే, వేడి నీరు కడుపులోని ఆమ్లంతో చర్య జరిపి, వాపు, చికాకు కలిగిస్తుంది. దీనివల్ల పుండు మరింత పెరిగి నొప్పి పెరుగుతుంది.
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD): అనేది కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహించే సమస్య. ఇది కడుపు చికాకుకు కారణమవుతుంది. వేడినీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి రిఫ్లక్స్ పెరుగుతుంది. ఇది కొన్నిసార్లు అటువంటి పరిస్థితిలో నొప్పిని కలిగిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో వేడినీరు తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య మరింత పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి
విరేచనాలు: విరేచనాలు సంభవించినప్పుడు, కడుపు, పేగులలో అధిక చికాకు ఉంటుంది. దీనివల్ల డయేరియా సమస్య పెరుగుతుంది. వేడినీరు తాగడం వల్ల శరీర జీవక్రియ, ప్రేగు కదలికలు మరింత వేగవంతం అవుతాయి. ఇది అతిసారం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. దీనివల్ల శరీరంలో నీరు, ఖనిజాలు లోపిస్తాయి. ఇది మీ ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజారేలా చేస్తుంది.
వేసవిలో: వేడినీరు తాగడం వల్ల శరీరం లోపల వేడి పెరుగుతుంది. మీరు ఇప్పటికే అధిక వేడి లేదా వడదెబ్బ వంటి సమస్యలతో బాధపడుతుంటే, వేడినీరు తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. వేడి నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల అలసట, తలనొప్పి, తలతిరుగుడు వంటివి వస్తాయి.
మూత్రపిండాల్లో రాళ్లు: శరీరంలోని ఖనిజాలు ఒకే చోట పేరుకుపోయి ఘనపదార్థాలుగా మారినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఈ పరిస్థితిలో వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఖనిజ అసమతుల్యత ఏర్పడుతుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు అతిగా వేడి నీరు తాగడం వల్ల రాళ్లతో పాటు మంట లేదా నొప్పి వస్తుంది. దీనివల్ల రాయి పెద్దదిగా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..