

మలయాళీ చిత్రపరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు కాదు.. కంటెంట్ బలంగా ఉండే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. స్టార్స్ లేకపోయినా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. అన్ని జానర్ చిత్రాలకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే మలయాళం సినిమాలకు ఇప్పుడు తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన రేఖాచిత్రం, ఐడెంటిటీ వంటి చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను తీసుకువస్తున్నారు మేకర్స్. మరీ ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమా గురించి తెలుసా.. ? అడియన్స్ ఊహించని ట్విస్టులు.. మతిపోగొట్టే విజువల్స్ తో ఓటీటీలో ఆ సినిమా దూసుకుపోతుంది. ఆ సినిమా పేరు చురులి.
మలయాళీ నటీనటులు చెంబన్ వినోద్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం చురులి. ఈ చిత్రానికి లిజో జోస్ పెళ్లిస్సేరీ దర్శకత్వం వహించగా.. మలయాళీ పాపులర్ యాక్టర్స్ జోజు జార్జ్, సౌబిన్ షాహిర్ క్లైమాక్స్ చివర్లో ముఖ్య పాత్రలు పోషించారు. వినయ్ థామస్ కథ అందించారు. సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఏ మాత్రం అర్థం కానీ పజిల్స్ తో మైండ్ గేమ్ ఆడుతుంది ఈ సినిమా. ఆ పజిల్స్ కానీ.. ఇటు ట్విస్టులను మాత్రం అసలు ఊహించలేము. అర్థం కావడానికి చాలా టైమ్ పడుతుంది. ఈ సినిమాకు ప్రస్తుతం ఐఎమ్డీబీలో 7 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో వచ్చే బీజీఎమ్ పిచ్చెక్కిస్తుంది. మనుషులు ప్రవర్తించే తీరు ఊహించని విధంగా ఉంటుంది. చురులి సినిమా చూస్తే మీ మతిపోవడం ఖాయమని అనిపిస్తుంది. అంతగా పజిల్స్, ట్విస్టులతో సాగుతుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..