
దిన ఫలాలు (ఏప్రిల్ 7, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోయే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆదాయానికి లోటుండకపోయినప్పటికీ ప్రస్తుతానికి ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. మిథున రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురువు, శనీశ్వరుడు, శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల తలపెట్టిన పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. సామాజికంగా గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. వ్యయ స్థానంలో అధికంగా గ్రహాలున్నందువల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో కార్యకలా పాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి లోటుండకపోయినప్పటికీ ప్రస్తుతానికి ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
దశమ స్థానంలో గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల అనేక విషయాల్లో సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువుల సాయంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అష్టమ శని ప్రభావం వల్ల ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో కూడా పనిభారం పెరుగుతుంది. విశ్రాంతి కరువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలి గిస్తుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సప్తమ, భాగ్య స్థానాల్లో రాశ్యధిపతి బుధుడు, గురువు, ఉచ్ఛ శుక్రుడు ఉన్నందువల్ల సాధారణంగా సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనా లకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగానేఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన శుభవార్త అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూలత కారణంగా ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్మును, బాకీలను కొద్ది ప్రయత్నంతో రాబట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శుభ గ్రహాలన్నీ ప్రస్తుతం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ధన స్థానంలో రాశ్యధిపతి శనితో పాటు నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు తృతీయ స్థానంలో ఉండడం, ఉచ్ఛ శుక్రుడితో పరివర్తన చెందడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక పరి స్థితి బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకో వాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి.