
దిన ఫలాలు (మార్చి 20, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృషభ రాశి వారు ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నా, ఇతరులకు ధరపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగంలో ఆశించిన అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో గుర్తింపు, డిమాండ్ పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందే అవకాశం ఉంది. ఈ రాశివారు సుందరకాండ పఠించడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు బలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నా, ఇతరులకు ధరపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. బంధు మిత్రుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చవద్దు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయపరంగా అంచనాకు మించిన అభివృద్ది కనిపిస్తోంది. రావలసిన సొమ్మును, బాకీలను కొద్ది ప్రయత్నంతో రాబట్టుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దుర్గాదేవిని పూజించడం వల్ల శుభఫలితాలు పెరుగు తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. మిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుల దైవాన్ని మరింత శ్రద్ధగా ప్రార్థించడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు కానీ, కుటుంబ ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. విష్ణు సహస్ర నామం పఠించడం చాలా మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
శుభ గ్రహాల అనుకూలత వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసి మరింతగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఇతరత్రా కూడా శుభవార్తలు ఎక్కువగా వింటారు ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఇతరుల సమస్యల్లో తలదూర్చవద్దు. స్కంద స్తోత్ర పఠనం చాలా మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో బాధ్యతలు, పని భారం పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. రోజూ గణపతి స్తోత్ర పఠనం చాలా మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
శుభ గ్రహాల అనుకూలత కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా విజయవంతం అవుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రముఖులతో సత్పంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. తరచూ శివార్చన చేయించడం అవసరం.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం తగ్గుతుంది. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు చదువులు, ఉద్యోగాల్లో అభివృద్ధి సాధిస్తారు. దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల చాలా మంచి జరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. షేర్లు, స్టాకులు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరి చయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలతో లబ్ధి పొందుతారు. లలితా సహస్ర నామం పఠించడం వల్ల ప్రతి ప్రయత్నమూ సానుకూలపడుతుంది.