
దిన ఫలాలు (ఏప్రిల్ 9, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అనేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబంలో ఒక ముఖ్య మైన శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి పనీ బాగా నిదానంగా పూర్తవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో అను కూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సవ్యంగా పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. తలపెట్టిన పనులల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. లాభాలపరంగా వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ప్రతి పనీ నిదానంగా సాగుతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థికపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లా సంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో పురోగతి చెందుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక విషయాలకు, ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో మీ సమర్థత, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు బాగుంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ విషయాలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పెరగ వచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆశించిన శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
పదోన్నతులు, జీతభత్యాల విషయంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభాలు గడిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం సంపాదించు కుంటారు. సహోద్యోగులకు సహకారం అందిస్తారు. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహా యం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగానూ, ఫలితం తక్కువగానూ ఉంటుంది. కుటుంబపరంగా కొద్దిగా చికాకులుంటాయి. తొందరపడి ఎవరికీ ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి.