
దిన ఫలాలు (మార్చి 27, 2025): మేష రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారి లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా రోజంతా అనుకూలంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల మీద బాగా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఒకటి రెండు మంచి అవకాశాలు, ఆఫర్లు అందుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబంలో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ప్రతి చిన్న ప్రయత్నం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రయాణాల్లో డబ్బు గానీ, విలువైన వస్తువులు గానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఆర్థిక విషయాల్లో ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం ఉత్తమం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు చిరుద్యోగంలో చేరాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలను, లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం అంచనాలకు తగ్గట్టుగా వృద్ది చెందుతుంది. కుటుంబ ఖర్చుల్ని అదుపు చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మనసులోని కోరిక నెరవేరుదుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవు తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తులవారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. తోబుట్టువులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచనలు ఉన్నాయి. ఏ ప్రయత్నం ప్రారంభిస్తే అది నెరవేరుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలి గిస్తుంది. కొందరు మిత్రుల సాయంతో కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. పెద్దల జోక్యంతో ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో శ్రమాధిక్యత కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆశించిన ప్రతిఫలం, ప్రోత్సాహ కాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కొద్ది శ్రమతో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. సొంత ఇంటి ప్రయత్నాలు పురోగతి చెందుతాయి. వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. బాధ్యతలు, లక్ష్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉన్నప్పటికీ, ఆర్థిక సహాయం విషయంలో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులు శుభవార్తలు తీసుకు వస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.