
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం యథావిధిగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది. మిథున రాశి వారు ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం యథావిధిగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆదా యం కొద్దిగా వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధుమిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. పెండింగు పనులు పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు ఉండే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం చాలా మంచిది. ఆస్తి వివాదం ఒకటి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడి అంచనాలను మించుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకుల నుంచి బయట పడతారు. ముఖ్యమైన వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయానికి లోటుండదు. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. స్థాన చలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కాస్తంత ఒత్తిడి ఉండవచ్చు. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలు విజయాలు సాధించే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను సజావుగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తోబుట్టువులతో అపార్థాలు తొలగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలుంటాయి. నిరుద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయం తీసుకోవడం మంచిది. విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో మీ సమర్థతకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుంచి సహ కారం అందుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. వ్యాపారాల్లో కొన్ని కష్టనష్టాలు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో మీ మీద అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. బంధుమిత్రులకు కొద్దిగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. సొంత పనులను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా మాత్రమే లాభాలు పెరుగుతాయి. ఆర్థిక కార్యకలాపాలు సానుకూలంగా జరిగిపోతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకోకుండా ఆదాయం డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. కొన్ని ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.