
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2025): మేష రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభించే అవకాశముంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. మిథునరాశి వారికి ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పురోగతి లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, అనుకూలంగా సాగిపోతాయి. బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ అంచనాలకు మించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు. ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొందరు మిత్రులతో కలిసి సమాజ సేవలో పాల్గొంటారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. స్నేహితుల సహా యంతో పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరు తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను, బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులు మీ మాటకు విలువనిస్తారు. ఆర్థిక వ్యవహారాలను సజావుగా. చక్కబెడతారు. పెండింగు పనులను పూర్తి చేయడం వల్ల ఆర్థిక లాభం పొందుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఖర్చులు తగ్గించుకుని, మదుపు చేయడం మంచిది. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదం విషయంలో రాజీ మార్గం అనుసరిస్తారు. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగుం టుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినా ఆశించిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. ఆదాయ విషయా లకు సమయం అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయత్నమూ కలిసివస్తుంది. ముఖ్యమైన వ్యవహా రాలు సవ్యంగా సాగిపోతాయి. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధపెట్టండి. ప్రయాణాలు లాభిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలుండే అవకాశం ఉంది. రోజంగా బాగా అనుకూలంగా గడిచిపోతుంది. అనుకోకుండా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా సఫల మవు తాయి. ప్రయాణాల వల్ల బాగా కలిసి వస్తుంది. చదువుల్లో పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారుల నుంచే కాక సహోద్యోగుల నుంచి కూడా సహకారం లభిస్తుంది. బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేస్తారు. డాక్టర్లు, లాయర్లకు మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరు గుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విదే శాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందు తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ1)
ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. కొందరు స్నేహితుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సవ్యంగా, సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన బాధ్యతలను సవ్యంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్ది ప్రయ త్నంతో ముఖ్యమైన కార్యకలాపాలన్నీ పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేయడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీగా, లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.