
దిన ఫలాలు (ఏప్రిల్ 18, 2025): మేష రాశి వారి ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక విషయాలకు, ముఖ్యంగా ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పొదుపులు, మదుపుల మీద, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. అనుకున్న పనులన్నీ తేలికగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారంలో కొన్ని కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా బాగా నిలదొక్కుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందడం వల్ల ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల జోక్యంతో పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. షేర్లు, స్టాకులు బాగా లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు పురోగతి చెందు తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబెడతారు. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత సమస్యల్ని పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. బాకీలు వసూలవుతాయి. సోదరులతో వివాదాలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొద్ది మార్పులతో వ్యాపారాలు ముందుకు దూసుకువెడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం అనుకూలం గానే ఉంటుంది. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొద్దిగా ఏలిన్నాటి శని ప్రభావం వల్ల మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలతో ఇబ్బంది పడడం, పనులు ఆలస్యం కావడం వంటివి జరుగుతుంటాయి. ధనపరంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలను లేదా బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలను, సమస్యలను అధిగమించి, లాభాలు గడిస్తారు. అనుకోకుండా ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఊరట చెందుతారు. ఏ విషయంలో అయినా యత్న కార్యసిద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫ్రతిఫలం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. విద్యార్థులు శుభవార్తలు తెస్తారు. నిరుద్యోగులకు మంచిఉద్యోగం లభించే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనులు నిదానంగా పురోగమిస్తాయి. ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. తలపెట్టిన వ్యవహారాలు సవ్యంగా, సజావుగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితంలో సామరస్యం బాగా పెరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలుంటాయి. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.