
దిన ఫలాలు (మార్చి 21, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆదాయానికి లోటుండదు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కొద్ది శ్రమతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు సమయం బాగుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నమ్మకం చూరగొంటారు. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలని స్తాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కానీ అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో కొన్ని అదనపు బాధ్యతలు, లక్ష్యాల వల్ల పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు అందుకు తగ్గట్టుగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వస్తు సామగ్రితో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధి స్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. షేర్లు తదితర పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. ఆదాయపరంగా దాదాపు ప్రతి ప్రయత్నమూ అనుకూలిస్తుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు వృద్ధి లోకి వస్తారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో కొద్దిగా అభిప్రాయభేదాలు కలిగే అవకాశం ఉంది. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పూర్తి చేస్తారు. ఆదాయంనిలకడగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొద్ది శ్రమతో విద్యార్థులు పురోగతి చెందుతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి జీవితంలో రాబడి కొద్దిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీగా పురోగమిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.