
దిన ఫలాలు (మార్చి 22, 2025): మేష రాశి వారికి ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. మిథున రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఆలోచింది నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితం ఇస్తుంది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో కూడా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆలస్యం అవుతున్న పనుల్ని ముందుగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమయి మానసికంగా ఊరట కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తవుతాయి. ఆస్తి వివాదం విషయంలో రాజీమార్గం అనుసరిస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగ విషయాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు గౌరవప్రదంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్ది పాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరాభిమానాలు పెరుగుతాయి. మీ పనితీరుతో సంతృప్తి చెందు తారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. డాక్టర్లు, లాయర్లకు మంచి అవకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదే వీలు బాగా లాభిస్తాయి. ప్రయాణాల వల్ల కూడా లాభాలు కలుగుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయుడం జరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగి పోతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి తరఫు బంధువుల రాకపోకలుంటాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో మీ మాటకు, మీ చేతకు తిరుగుండదు. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.