
హెూండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా 2025 డియోను ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్డేటెడ్ డియో స్కూటర్ కాస్మెటిక్ మార్పులు, ఓబీడీ2-కంప్లైంట్ ఇంజిన్, కొత్త ఫీచర్లతో వస్తుంది. 2025 హెూండా డియో రెండు వేరియంట్లలో అమ్ముతున్నారు. డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ పేరుతో రిలీజ్ చేసే అప్డేటెడ్ స్కూటర్ల ధర రూ.96,749,రూ.1,02,144గా ఉంటుంది. 2025 హెూండా డియో ఇప్పుడు కొత్త 4.2 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. తాజా అప్డేటెలో మైలేజ్ ఇండికేటర్లు, ట్రిప్ మీటర్, ఎకో ఇండికేటర్, పరిధి వివరాలను చూడవచ్చు. నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్ వంటి ఫంక్షన్లను ఎనేబుల్ చేసే హెూండా రోడ్ సింక్ యాప్ సపోర్ట్ కూడా ఉంది. ముఖ్యంగా రైడర్లు ప్రయాణంలో ఉన్నప్పుడు కనెక్ట్ అయి ఉండటానికి వీలు కల్పిస్తుంది. మొబైల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి స్మార్ట్ కీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కూడా ఉన్నాయి.
2025 హెూండా డియో ఐదు రంగుల ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ స్పోర్ట్స్ ఎల్లో, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. 2025 హెూండా డియో 123.92 సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్- ఇంజెక్టెడ్ 8.19 బీహెచ్పీ, 10.5 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంధన వినియోగం, ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడే ఐడ్లింగ్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ ఈ స్కూటర్ ప్రత్యేకతగా ఉంటుంది.
ఈ లాంచ్‌పై హెూండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ కొత్త ఓబీడీ2బీ వెర్షన్ డియో 125 రిఫ్రెష్డ్ గ్రాఫిక్స్, అధునాతన టీఎఫ్టీ డిస్ప్లే, మెరుగైన కనెక్టివిటీ లక్షణాలతో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఈ స్కూటర్ ట్రెండీ, నమ్మకమైన మోటో-స్కూటర్ కోసం చూస్తున్న కస్టమర్లకు మంచి ఎంపిక అని వివరించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..