

మధుర, బృందావనంలలో హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. రంగుల్లో నిండిపోయిన దృశ్యాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అయితే.. ఒక మహిళ కొరడాతో హోలీ ఆడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించింది. బృందావనం హోలీ దాని ప్రత్యేకమైన సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ హోలీ ఆడే సాంప్రదాయం.. ఈ సంఘటనకు భిన్నంగా ఉంటుంది. ఈ మహిళ ఠాకూర్ బంకే బిహారీ ఆలయం సమీపంలో హోలీ ఆడినట్లు చెబుతున్నారు.
బృందావనంలో జరిగే హోలీ దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. రాధా కృష్ణుల ప్రేమ బృందావనంలో మాత్రమే కనిపిస్తుంది. రాదా కృష్ణులు ఇక్కడ కలుసుకుని ఒకరితో ఒకరు హోలీ ఆడుకున్నారు. రంగులు పూసుకుని సంతోషంగా గడిపారు అని ఓ నమ్మకం. అయితే తాజాగా హోలీ వేడుకల్లో భాగంగా ఠాకూర్ బంకే బిహారీ ఆలయం దగ్గర ఒక మహిళ ఆలయం దగ్గరకు వస్తున్న భక్తులందరినీ కొరడాతో కొడుతోంది.
బాంకే బిహారీ ఆలయానికి చేరుకుంటున్న భక్తులు
సమాచారం ప్రకారం భక్తులు కన్నయ్యతో హోలీ ఆడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కన్నయ్య భక్తులు బంకే బిహారీ ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తులు తమ విగ్రహంతో హోలీ ఆడుతున్నారు. మరో వైపు ఓ రోడ్డు మీద ఒక మహిళ హోలీ ఆడుతూ కనిపించింది కానీ ఆమె హోలీ ఆడే శైలి అందరికంటే భిన్నంగా కనిపించింది.
మహిళలు ఒక ప్రత్యేకమైన రీతిలో హోలీ ఆడుతున్నారు.
ఠాకూర్ బంకే బిహారీ ఆలయం దగ్గర మహిళా భక్తులు హోలీ ఆడుతున్నారు. మహిళలపై రంగులు చల్లుకుంటున్నారు. భక్తులు మొత్తం హోలీ పండగ వేడుకను జరుపుకోవడంలో నిమగ్నమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..