
చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. హోలీ పండుగ పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీక. హోలీ పండుగ శత్రువులను కూడా స్నేహితులుగా మారుస్తుందని నమ్ముతారు. రంగుల కేళి హోలీని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హిందూ మత గ్రంథాలలో హోలీ పండుగ రోజున శివుడిని పూజించడం చాలా పవిత్రమైనదిగా పేర్కొంది. నమ్మకాల ప్రకారం హోలీ పండుగ రోజున శివలింగానికి కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించడం ద్వారా.. శివుడు సంతోషించి తన ప్రత్యేక ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడు. కనుక హోలీ రోజున శివుడికి ఏ వస్తువులను సమర్పించాలో ఈ రోజు తెలుసుకుందాం..
నమ్మకాల ప్రకారం…
హోలీ రోజున ప్రజలు అబిర్, రంగులు, గులాల్ లను ఒకరిపై ఒకరు పూసుకుంటారు. అలాగే హోలీ రోజున, రంగులు, గులాల్ మొదలైనవాటిని దేవుళ్ళకు కూడా సమర్పిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిధి ప్రారంభమైంది. ఫాల్గుణ పూర్ణిమ గురువారం ఉదయం 10:35 గంటలకు ప్రారంభమావ్వగా.. ఈరోజు మార్చి 14న మధ్యాహ్నం 12:23 గంటలకు ముగుస్తుంది.
శివయ్యకు ఈ వస్తువులను సమర్పించండి:
హోలిక దీపోత్సవం:
హోలీ పండుగ రోజున హోలికా దహనం చేసిన అనంతరం వచ్చిన భస్మాన్ని తీసుకుని ఆ భస్మాన్ని శివలింగానికి సమర్పించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం హోలీ పండుగ రోజున శివయ్యను హోలికా దహన భస్మాన్ని సమర్పించే వారి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం. అంతేకాదు ఇంటిలోని ప్రతికూలత తొలగిపోతుంది. అలాగే కుటుంబ సభ్యులు అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
నీలం, ఎరుపు రంగులు:
హోలీ రోజున శివలింగంపై నీలం, ఎరుపు గులాల్ను కూడా సమర్పించాలి. హోలీ పండుగను పౌర్ణమి రోజున జరుపుకుంటారు.. కనుక ఈ రోజున శివలింగానికి గులాల్ సమర్పించడం చాలా పవిత్రమైనది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు