
హోలీ పండగ సందడి మొదలైంది. మరికొన్ని గంటల్లో పిల్లలు, పెద్దలు హోలీ రంగులతో ఆడుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే హోలీ జరుపుకునే రకరకాల రీల్స్ తయారు చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక జంట బెలూన్లలో రంగులను నింపి గాలిలోకి రంగులను విడిచి పెడుతూ కనిపిస్తున్నారు. హోలీ పండగ సందర్భంగా రూపొందించిన కొత్త వైరల్ వీడియో చూపరులను ఆకట్టుకుంది. దీనితో పాటు హోలీ రోజున రంగుల బుడగలను ఎలా తయారు చేయాలనేది తెలుసుకుంటున్నారు. ఈ వైరల్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అబిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఈ ఏడాది హోలీకి ముందు రంగుల బెలూన్లను పేల్చే ట్రెండ్ మొదలైంది. ఒక జంట తమ చేతుల్లో రంగులను నింపి ఉన్న రెండు బెలూన్లను పట్టుకుని ఉన్నారు. ఈ బెలూన్లతో రంగులు చల్లుకుంటున్నారు. ఈ వైరల్ రీల్ 5 కోట్ల 51 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. 8 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. వెయ్యిమందికి పైగా రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అబిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
@preetiandvijay అనే యూజర్ ఈ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ‘ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అనే కామెంట్ ను జత చేసి పోస్ట్ చేశారు. హోలీ రోజుని డిఫరెంట్ గా జరుపుకోవాలని భావిస్తే దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ముందుగా ఏదైనా కంపెనీకి చెందిన రూ.10 విలువైన వాటర్ బాటిల్ ని తీసుకొని..దాని మూత వైపు నుంచి కొంచెం బాటిల్ ఉండేలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బెలూన్ను గాలితో నింపి దానిని బాటిల్ మూతకి అతికించాలి.
బెలూన్ నుంచి గాలి బయటకు రాకుండా ఉండటానికి.. బాటిల్ మూతని ముందు మీ చేతులతో దాన్ని పట్టుకోండి. తర్వాత బాటిల్ కట్ చేసిన భాగాన్ని పై నుంచి రంగుతో నింపండి. తర్వాత బెలూన్ నుంచి గాలిని మెల్లమెల్లగా విడిచి పెట్టండి. అప్పుడు బాటిల్ లో ఉన్న రంగు గాలిలో కలుస్తూ కలర్ ఫుల్ గా ఎగురుతుంది. కొంతమందికి ఈ ట్రిక్ చాలా నచ్చింది. అదే సమయంలో చాలా మందికి ఇది కష్టమైన పనిగా అనిపిస్తుందని కామెంట్ చేశారు. మరొక వినియోగదారుడు వాక్యూమ్ క్లీనర్‌ను రివర్స్‌లో అమలు చేస్తే.. ఇదే ఫలితం వస్తుందని కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..