
ఆరు నెలలుగా ఇబ్బంది పడుతున్నా… అయినా ఇంకా కోలుకోలేదు. కాకపోతే గతం కన్నా ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నాను అంటున్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
అన్నీ సందర్భాలూ మనకు అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు శరీరం, మనసు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాయి. వాటిని పట్టించుకోవాలి. అప్పుడే సంపూర్ణారోగ్యం సాధ్యపడుతుందంటున్నారు రకుల్.
ఆరు నెలల క్రితం జిమ్‌లో దాదాపు 80 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తూ గాయపడ్డారు రకుల్. దానంతట అదే తగ్గిపోతుందని అశ్రద్ధ చేశారు. కానీ, సమస్య ఇబ్బందిపెట్టడంతో చికిత్స తీసుకున్నారు. ఇన్నాళ్ల పాటు విశ్రాంతిలో ఉన్న ఆమె, ఇప్పుడు మెల్లిగా పనులు మొదలుపెట్టారు. రష్మిక అయితే ఆ మాత్రం విశ్రాంతి కూడా తీసుకోలేదు.
కాలికి కట్టు కట్టుకుని, నడవలేని స్థితిలోనూ సినిమాల ప్రమోషన్లకు హాజరయ్యారు రష్మిక మందన్న. ఇంకో తొమ్మిది నెలల పాటు ఈ పరిస్థితి తప్పదని ఆ మధ్య ఓపెన్ అయ్యారు రష్మిక మందన్న. కాలికి గాయమైనా షూటింగ్‌కీ, ప్రమోషన్లకీ నేషనల్ క్రష్ హాజరవుతున్న తీరు ఇన్స్పైరింగ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు సల్మాన్ ఖాన్.
సిటాడెల్ సెట్లో ఎన్నిసార్లు స్పృహ కోల్పోయానో లెక్కే లేదు. ఎలాగైనా ఆ ప్రాజెక్టు నుంచి గట్టెక్కితే చాలనుకున్నాను అంటూ మయోసైటిస్ తీవ్రంగా ఇబ్బందిపెట్టిన రోజుల్ని గుర్తుచేసుకుంటారు సమంత. ఓ వైపు దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే, మరోవైపు స్ట్రాంగ్‌గా నిలబడుతూ, వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు ఈ లేడీ.