
హీరో మోటోకార్ప్ తన బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ స్ప్రెండర్ ప్లస్‌ను అదిరే ఫీచర్స్‌తో అప్డేట్ చేసింది. 2025 హీరో సెండర్ ప్లస్ ఇటీవల హీరో డీలర్ల వద్దకు చేరింది. ముఖ్యంగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో ఈ బైక్‌ను అప్‌గ్రేడ్ చేశారు. అలాగే ఈ బైక్‌లో కొత్త కలర్ ఆప్షన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2025 హీరో సెండర్ ప్లస్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే డిజైన్ ఉంది. అయితే ఫీచర్స్‌పరంగా కొన్ని ప్రధాన మార్పులు ఉన్నాయి. 2025 సెండర్ ప్లస్ స్పైషాట్ కనీసం మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లతో వస్తుంది. గోల్డ్ డెకల్తో కూడిన ఎరుపు రంగులో ఉంంటే మరొకటి బూడిద రంగులో ఉంటుంది. ఈ కొత్త కలర్ స్కీమ్స్‌తో పాటు కొత్త సెండర్ ప్లస్ అప్డేటెడ్ బాడీ గ్రాఫిక్స్ కూడా వస్తుందని భావిస్తున్నారు.
2025 హీరో సెండర్ ప్లస్ హార్డ్ వేర్ అప్ గ్రేడ్ల విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఒక పెద్ద మార్పుగా ఉంటుంది. కొత్త హీరో సెండర్ ప్లస్‌ను ఫ్రంట్ డిస్క్ బ్రేక్ హీరో స్ప్రెండర్ ప్లస్ ఎక్స్ క్లో అందుబాటులో ఉంటుంది. అలాగే డిజిటల్ స్క్రీన్‌తో వచ్చే ఆధునిక వెర్షన్‌లా ఉంటుంది. డిస్క్ బ్రేక్ ఇప్పటికే ఉన్న డ్రమ్ బ్రేక్ సెటప్‌తో పోలిస్తే మెరుగైన బ్రేకింగ్ పవర్‌తో మోటార్ సైకిల్‌కు సంబంధించిన భద్రతా గుణాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. అయితే ఈ బైక్ వెనుక టైర్ డ్రమ్ బ్రేక్ సెటప్‌తో వస్తుంది. పవర్ ట్రెయిన్ విషయానికి వస్తే ముందు భాగంలో మోటార్ సైకిల్ 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ప్రస్తుత మోడల్స్ 7.91 బీహెచ్పీ పీక్ పవర్, 8.05 ఎన్ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
2025 హీరో సెండర్ ప్లస్ స్పెసిఫికేషన్లు పెద్దగా మారకుండా ఉంటాయని భావిస్తున్నప్పటికీ ఇంజిన్ ఓబీడీ-2బీ నార్మ్ కంప్లైయన్స్‌తో అప్డేట్ ఉంటుంది. ట్రాన్స్మిషన్ డ్యూటీ కోసం మోటార్ సైకిల్ నాలుగు-స్పీడ్ గేర్ బాక్స్‌తో ఆకట్టుకుంటుంది. కొత్త సెండర్ ప్లస్ ఎప్పుడు విడుదల అవుతుందో? హీరో మోటోకార్ప్ ఇంకా వెల్లడించలేదు. హీరో సెండర్ ప్లస్ ప్రస్తుత ధర రూ.77,176 రూ.79,926 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటే, కొత్త సెండర్ ప్లస్ కొంచెం ఎక్కువ ధరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి