
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో కనిపించాల్సిన ఎఫెక్ట్- తెలుగురాష్ట్రాల్లో మార్చిలోనే కనిపిస్తోంది. వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పదకొండు దాటిందంటే చాలు- ఎండ మండిపోతుంది. ఇప్పటికే టెంపరేచర్లు 42 డిగ్రీల మార్క్‌ను దాటేశాయి. దీంతో ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.. మధ్యాహ్నం వేళ అసవరమైతేనే బయటకు రావాలంటూ సూచిస్తోంది.. ఎండ దెబ్బకు గురికాకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది.
మంగళవారం ఆంధ్రప్రదేశ్ లో 128 మండలాల్లో వడగాలులు, 29 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది.. మంగళవారం (18-03-25) పార్వతీపురంమన్యం జిల్లా-13, శ్రీకాకుళం జిల్లా -7, విజయనగరం జిల్లా-8, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు (29), వడగాల్పులు(99) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అటు తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మార్చి రెండో వారంలోనే రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. నిన్న తెలంగాణలోని 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి..
ఒకసారి నిన్నటి ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 40.3, నిజామాబాద్ 40.1, భద్రాచలం 40, మహబూబ్ నగర్ 40, మెదక్ 39.4, హైదరాబాద్ 39.2 డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..
ఆంధ్రాలో అధికమైన ఎండ తీవ్రత..
ఆంధ్రాలో ఎండ తీవ్రత అధికమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఒకసారి ఏపీలో నిన్నటి ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలిస్తే.. పార్వతీపురంమన్యం జిల్లా వీరఘట్టంలో 42.8°C, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6°C, అనకాపల్లి జిల్లా నాతవరం, 42.1°C, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, 42.1°C, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1°C, కర్నూలు జిల్లా నన్నూర్ లో 41.7°C.. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా 40 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 78 మండలాల్లో వడగాల్పులు వీచీనట్లు వాతావరణ కేంద్రం చెప్పింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..