
ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి: ఛాతీ మధ్యలో ఒత్తిడి, బిగుతు లేదా నొప్పి ఉండవచ్చు, ఇది కొన్ని నిమిషాలు లేదా ఎక్కువసేపు ఉండవచ్చు. సాధారణంగా ఎడమ చేతిలో నొప్పి మొదలై.. రెండు చేతులకూ పాకవచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఊపిరి తీసుకోవడంలో ఆటంకం కలగడం లేదా శ్వాస ఆడకపోవడం, అన్నటికంటే ముఖ్యంగా ఛాతీ నొప్పితో కలిసి వస్తే. వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.
అలసట లేదా బలహీనత: అసాధారణమైన అలసట, శరీరం బలహీనంగా అనిపించడం, ముఖ్యంగా స్త్రీలలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. నేషనల్ హార్ట్, బ్లడ్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం పురుషుల కంటే మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది.
చేయి, భుజం లేదా దవడలో నొప్పి: ఛాతీ నుండి ఎడమ చేయి, భుజం లేదా దవడ వైపు వ్యాపించే నొప్పి లేదా అసౌకర్యం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి.
వికారం లేదా చెమటలు: కడుపులో అసౌకర్యం, వాంతులు వచ్చేలా ఉండటం లేదా చల్లని చెమటలు పట్టడం వంటివి కూడా గుండె పోటుకు సంకేతాలు అని చెప్పవచ్చు.
తల తిరగడం లేదా మూర్ఛ: రక్తప్రవాహం తగ్గడం వల్ల తల తిరగడం లేదా స్పృహ కోల్పోయే భావన కలగడం కూడా హార్ట్ అటాక్ కు సంకేతాలు. ఇలాంటి సమయం లో వెంటనే వైద్యుడిని కలవడం మంచిది.