
ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే అనే సామెత మనం తరచుగా వింటుంటాం.. అమ్మా.. నాన్నా ప్రేమ, ఆప్యాయత, అనుబంధం అందరికీ ఒక్కటే.. వీటి గురించి విన్నా.. కళ్లారా చూసినా.. చాలా మంది భావోద్వేగానికి లోనవుతారు.. అచ్చం అలాంటి సందర్భమే సిద్దిపేటలో కనిపించింది. మాజీ మంత్రి హరీష్ రావు నిత్యం ప్రజలను, యువకులను, విద్యార్థులను.. కాలానికి, పరిస్థితులకు అనుకూలంగా పలు సూచనలు చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు. అయితే.. విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్ రావు కన్నీళ్లు పెట్టారు.
విద్యార్థులు భవిష్యత్తులో ముందుకెళ్లడానికి, ఉన్నతంగా ఎదగడానికి ప్రోత్సాహాన్ని అందించేలా.. భద్రంగా ఉండాలి.. భవిష్యత్తులో ఎదగాలి.. అనే కార్యక్రమాన్ని సిద్ధిపేటలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తన పరిస్థితుల గురించి వివరించింది.. తాను రెండవ తరగతిలో ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి స్కూల్ ఫీజు కడుతుంది అంటూ.. విద్యార్థిని కంటతడి పెట్టింది.. ఆ దృశ్యాన్ని చూసిన హరీష్ రావు హృదయం చలించిపోయింది. ఆ చిన్న పాపను ఓదార్చి నేనున్నానంటూ భరోసా ఇస్తూ,హరీష్ రావు కూడా కంటతడి పెట్టారు.. అది చూసిన చాలామంది చలించి పోయారు.
వీడియో చూడండి..
సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్స్ లో “భద్రంగా ఉండాలి- భవిష్యత్ లో ఎదగాలి” పేరుతో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మోటీవేషన్ తరగతులు నిర్వహించగా.. కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుండగా.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమ్మానాన్నలకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలంటూ.. వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలంటూ హరీష్ రావు ఆకాంక్షించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..