
శ్రీ రాముని భక్తుడైన హనుమంతుడిని పూజిస్తూ హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి ఇది. 2025 ఏప్రిల్ 12 వ తేదీ శనివారం హనుమాన్ జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఈ రోజు తన అసమానమైన శారీరక బలం, అచంచలమైన భక్తి , నిస్వార్థ సేవకు ప్రసిద్ధి చెందిన హనుమంతుడి జన్మదినోత్సవం. కేసరి అంజన దేవిల తనయుడు ఆంజనేయుడు. హనుమంతుడు కేసరి అని కూడా పిలుస్తారు. ఆంజనేయస్వామి ధైర్యం, నిస్వార్థ సేవ అంకితభావానికి ప్రతీక. మన దేశంలోని హిందువులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ రోజును హనుమతుండిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు.
ఈ రోజున భక్తులు బజరంగ బలి ఆశీర్వాదం కోసం రామలయలను, హనుమంతుడి ఆలయాలను సందర్శిస్తారు. ఉపవాసం ఉంటారు. హనుమాన్ చాలీసాను జపిస్తారు. అయితే ఈ ఆధ్యాత్మిక వేడుకను జరుపుకోవడానికి అనుసరించాల్సిన నిర్దిష్ట సంప్రదాయాలు, నిబంధనలు ఉన్నాయి. అలాగే నివారించాల్సిన పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ రోజున చేయాల్సిన పనులు.. చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..
హనుమాన్ జయంతి తేదీ, సమయం
దృక్ పంచాంగం ప్రకారం చైత్ర మాసం పౌర్ణమి తిథి శనివారం, ఏప్రిల్ 12వ తేదీ, 2025 ఉదయం 03:21 గంటలకు ప్రారంభమై, ఆదివారం, ఏప్రిల్ 13వ తేదీ, 2025 ఉదయం 05:51 గంటలకు ముగుస్తుంది. కనుక హనుమంతుడి జయంతిని పౌర్ణమి రోజు , ఏప్రిల్ 12వ తేదీన జరుపుకోనున్నారు. హిందూ మతంలో ముఖ్యమైన పంగడ కనుక చాలా మంది ఈ రోజు ఉపవాసం ఉంటారు. హనుమంతుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పుజిస్తారు.
ఇవి కూడా చదవండి
ఈ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటంటే
- ఈ రోజున చేయాల్సిన పనులు: హనుమాన్ జయంతి రోజున కోతులకు బెల్లం తినిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
- హనుమాన్ జయంతి రోజున దానం చేయడం శుభప్రదమని నమ్మకం. ఈ రోజున దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుందని నమ్మకం.
- హనుమంతుడికి సిందూరం, తమలపాకులు సమర్పించడం శుభప్రదం.
- హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ముఖ్యంగా సాధకుడు బ్రహ్మ చర్యాన్ని పాటించాలి.
- హనుమంతుడిని పూజించేటప్పుడు ఎర్రటి పువ్వులు, దేశీ నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి.
ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు
- హనుమాన్ జయంతి రోజున తామసిక ఆహారం తినకూడదు.
- హనుమాన్ జయంతి రోజున, ఏ జంతువునూ ఇబ్బంది పెట్టకూడదు లేదా హాని చేయకూడదు.
- హనుమాన్ జయంతి రోజున మాంసాహార ఆహారాన్ని తినొద్దు. మద్యం లేదా మత్తు పదార్థాలు వాడకూడదు.
- ఈ రోజున ప్రజలతో గొడవలు పడవద్దు. ఇతరులను అవమాన పరిచేటట్లు ప్రవర్తించరాదు.
హనుమాన్ జయంతి అనేది బలం, రక్షణ, దైవిక ఆశీర్వాదాలను కోరుకునే శక్తివంతమైన సందర్భం. ఈ పవిత్రమైన రోజున చేయవలసిన వాటిని పాటించడం, చేయకూడని వాటికి దూరంగా ఉండడం వలన భక్తులకు అంతర్గత శాంతి, హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఉపవాసాలు, ఆలయ సందర్శనలు, మంత్రాలు చదవడం, నిస్వార్థ సేవ చేయడం ద్వారా పండుగను వైభవంగా జరుపుకోవచ్చు. ఈ నియమాలను అనుసరిస్తూ భక్తులు 2025లో హనుమాన్ జనమోత్సవాన్ని సంతృప్తికరంగా, శుభప్రదంగా చేసుకోవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు