
మనం ప్రతిరోజూ అనేక వస్తువులను తాకుతుంటాం. అది సహజం. కానీ కొన్ని వస్తువులలో లక్షలాది వైరస్లు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వస్తువులను తాకిన తర్వాత చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. లేదంటూ మనం పదే పదే ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. మనం తెలిసి లేదా తెలియకుండా తాకిన కొన్ని వస్తువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైంది. ఇటీవల న్యూయార్క్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో కరెన్సీ నోట్లలో వేలాది క్రిములు, వైరస్లు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి ఒకరి నుండి మరొకరికి అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. అలాగే 2017లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో కూడా చేతి పరిశుభ్రత పేగు వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది. కాబట్టి వైద్యుల అభిప్రాయం ప్రకారం మీరు తాకిన తర్వాత ఎల్లప్పుడూ మీ చేతులను కడుక్కోవాల్సిన వస్తువుల జాబితా ఈ కింద ఉంది. వాటిని పొరబాటున ముట్టుకుంటే వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది..
కరెన్సీ నోట్లు
డబ్బును ఇష్టపడని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు. నోట్లను లెక్కించడం, నిల్వ చేయడం ప్రతి ఒక్కరూ ఆనందించే పని. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ చెల్లింపులు విస్తృతంగా పెరిగినప్పటికీ, నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గలేదు. కానీ నోట్లు మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని మీకు తెలుసా? అవును.. సాధారణంగ నోట్లు ఒకరి చేతి నుంచి మరొకరికి మారుతూ ఉంటాయి. కానీ ఇది జరిగినప్పుడు వాటిలో ఉండే సూక్ష్మక్రిములు, వైరస్లు కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. న్యూయార్క్ బ్యాంకులో నిర్వహించిన పరిశోధనలో కరెన్సీ నోట్లపై వైరస్లు, బ్యాక్టీరియా, జంతువుల DNA కూడా ఉన్నట్లు కనుగొన్నారు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, నోట్లను తాకిన తర్వాత కూడా మీ చేతులను బాగా కడుక్కోవడం చాలా అవసరం.
హోటళ్లలో మెనూ కార్డులు
చాలా మంది రెస్టారెంట్లు లేదా హోటళ్లలో మెనూ కార్డులను తాకుతుంటారు. కాబట్టి క్రిములు దీని ద్వారా కూడా మన శరీరంలోకి ప్రవేశించవచ్చు. అరిజోనా విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధన ప్రకారం రెస్టారెంట్ మెనూ కార్డులలో దాదాపు 1,85,000 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని ముట్టుకున్న తర్వాత చేతులు కడుక్కోకపోతే, ఆహారం తినే సమయంలో అవి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. అందుకే మీరు రెస్టారెంట్ మెనూలను తాకిన తర్వాత ఆహారం తినే ముందు చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం.
ఇవి కూడా చదవండి
ఆసుపత్రి వస్తువులు
సాధారణంగా ప్రతిరోజూ అనేక రకాల రోగులు ఆసుపత్రులకు వస్తుంటారు. ప్రజలు ఆసుపత్రులలోని వస్తువులను తాకడం వల్ల లోపల అనేక వైరస్లు, క్రిములు ఉంటాయి. అందువల్ల, ఆసుపత్రి బెంచీలు, డోర్ హ్యాండిల్స్, ఎక్స్-రే యంత్రాలు, బయోమెట్రిక్ ప్యాడ్లు మొదలైన వస్తువులను తాకిన వెంటనే మీ చేతులను కడుక్కోవడం బెటర్.
బస్సులు, రైళ్లు, మెట్రోలలోని వస్తువులు
ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. బస్సులు, రైళ్లు, మెట్రోలలో చాలా మంది హ్యాండిల్స్, సీట్లు, డోర్ నాబ్లను తాకుతారు. మనం దానిని తాకినప్పుడు క్రిములు వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో ప్రయాణికుల చేతుల ద్వారా అనేక సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. అందువల్ల బస్సు హ్యాండిల్స్, మెట్రో గేట్లను తాకిన వెంటనే మీ చేతులను కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడటం చాలా ముఖ్యం.
పెన్నులు, పెన్సిళ్లు
వాల్ స్ట్రీట్ జర్నల్ అధ్యయనం ప్రకారం.. చాలా మంది వ్యక్తులు కార్యాలయంలో లేదా ఇతర కార్యాలయాలలో పెన్నులను ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా ఉపయోగించే పెన్నులో టాయిలెట్ సీటు కంటే 10 రెట్లు ఎక్కువ సూక్ష్మక్రిములు ఉంటాయి. కాబట్టి కార్యాలయాలు, బ్యాంకులు లేదా బహిరంగ ప్రదేశాలలో పెన్నులను ఉపయోగించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వేరొకరి పెన్ను ఉపయోగించిన వెంటనే మీ చేతులను కడుక్కోవడం మంచిది.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.