

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను చాకచక్యంగా అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళగిరి మండలం కాజాలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి మంగళగిరి ప్రాంతంలో విక్రయిస్తున్నారన్న సమాచారంతో పక్కాగా స్కెచ్ వేసి పట్టుకున్నారు మంగళగిరి రూరల్ పోలీసులు.