దక్షిణాది పరిశ్రమలో సూపర్ స్టార్ కావడానికి ప్రయాణం అంత సులభం కాదు. చాలా మంది నటులు విజయం సాధించడానికి ముందు చాలా కష్టపడ్డారు. రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రవితేజ వంటి హీరోలు తమ కెరీర్ ప్రారంభంలో చిన్న , పెద్ద ఉద్యోగాలు చేసి, ఆపై స్వయం కృషితో పరిశ్రమలో పెద్ద స్థానాన్ని సాధించారు. పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు సైం.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కేవలం రూ.250 కోసం సిమెంట్ కంపెనీలో పనిచేశాడు. ఇప్పుడు అతడు రూ.170 కోట్లకు యజమాని. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? హీరోగా, విలన్ గా తనదైన నటనతో మెప్పించాడు.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయనతో నటించడానికి నటీనటులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన అద్భుతమైన నటనకు జాతీయ అవార్డ్ అందుకున్నారు. 6వ తరగతి వరకు అక్కడ తన విద్యను పూర్తి చేసిన తర్వాత, చెన్నైకి వచ్చాడు. అతను చదువులో అంతగా రాణించలేదు. అతని ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పాఠశాలలో అతన్ని ఆటపట్టించేవారు. 16 సంవత్సరాల వయసులో అతను ఒక సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లాడు. కానీ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల, ఎంపిక కాలేదు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. రిటైల్ దుకాణంలో సేల్స్‌మ్యాన్‌గా, కొన్నిసార్లు ఫాస్ట్ ఫుడ్ జాయింట్లో క్యాషియర్‌గా, కొన్నిసార్లు ఫోన్ బూత్ ఆపరేటర్‌గా పనిచేశాడు. అలాగే హోల్‌సేల్ సిమెంట్ వ్యాపారంలో అకౌంట్ అసిస్టెంట్‌గా వర్క్ చేశాడు. ఆ నటుడు మరెవరో కాదు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. దుబాయ్ వెళ్లి అక్కడ అకౌంటెంట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. దుబాయ్‌లో పనిచేస్తున్నప్పుడు, అతను తన కాబోయే భార్య జెస్సీని కలిశాడు. వారు 2003లో వివాహం చేసుకున్నారు. నటనపై ఆసక్తితో ఇండియాకు వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్.. ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. తమిళం, హిందీ, తెలుగు భాషలలో నటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
