
Gujarat Titans vs Rajasthan Royals, 23rd Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో 23వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టీం బ్యాటింగ్ చేయనుంది.
వనిందు హసరంగా వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో ఫజల్ హక్ ఫారూకీకి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో, గుజరాత్ జట్టు గత మ్యాచ్ ప్లేయింగ్-11లో ఎటువంటి మార్పులు చేయలేదు.
2022 ఛాంపియన్స్ గుజరాత్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 1 ఓటమితో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. మరోవైపు, 2008 ఛాంపియన్స్ రాజస్థాన్ 18వ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి, 2 గెలిటచి, 2 ఓడిపోయింది.
ఇరు జట్లు:
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, ఫజల్హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్లు:
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అర్షద్ ఖాన్.
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: కునాల్ సింగ్ రాథోడ్, శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్ చరక్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..