
పచ్చి బఠానీల్లో ఉండో విటమిన్ C, ఇతర యాంటీఆక్సిడెంట్లు వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బఠానీలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. బఠానీలను క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పచ్చి బఠానీలో ప్రోటీన్‌తో పాటు విటమిన్ కె బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. పచ్చి బఠానీలను తింటుంటే ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.గర్భిణీ స్త్రీలకు పచ్చి బఠానీలు మేలు చేస్తాయి. ఇది పిండానికి తగిన పోషణను కూడా అందిస్తుంది. ఇది కాకుండా, ఇది రుతుక్రమ సమస్యలలో కూడా ఉపయోగపడుతుంది.
బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి, దీని కారణంగా ఆకలి తగ్గుతుంది. ఇది జింక్, రాగి, మాంగనీస్, ఇనుము కలిగి ఉంటుంది. దానివల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు. రెగ్యులర్‌గా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ నిరోధిస్తాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ప్రభావాన్ని దూరం చేస్తుంది.
పచ్చి బఠానీలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పచ్చి బఠానీ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్ కంట్రోల్లో ఉంటుంది. పచ్చి బఠానీలు క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది.
పచ్చి బఠానీలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. కడుపులో మంచి చేసే బ్యాక్టీరియాను పెంచుతుంది.. జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గేందుకు కూడా బఠానీలు ఉపకరిస్తాయి. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి బఠానీలు బెస్ట్ చాయిస్ అంటున్నారు నిపుణులు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు కూడా పచ్చి బఠానీలు సహకరిస్తాయి. వీటిలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.