
ద్రాక్ష తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నల్ల ద్రాక్షలో ఆంథోసైనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్షలో విటమిన్ K, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ రుచికరంగా ఉండే ఆరోగ్యానికి మంచి పండ్లు. మనం కొనే పండ్లలో ద్రాక్షకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి తినడానికి సులభంగా ఉండి రుచి కమ్మగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్లో నాలుగు నుంచి ఐదు రోజులు నిల్వ ఉంచగలిగే ఈ పండ్లు ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. కానీ పచ్చ ద్రాక్ష లేదా నల్ల ద్రాక్ష ఏది తినడం మంచిదో అనేది చాలా మందికి సందేహంగా ఉంటుంది.
ధరలో తేడా
సాధారణంగా పచ్చ ద్రాక్ష చౌకగా ఉంటుంది. కానీ నల్ల ద్రాక్ష కొంచెం ఖరీదైనది. అందువల్ల చాలా మంది తరచుగా పచ్చ ద్రాక్షనే కొనుగోలు చేస్తారు. అయితే ధర ఎక్కువగా ఉండటం వల్ల నల్ల ద్రాక్ష మేలంటూ అనుకోవాల్సిన అవసరం లేదు.
రుచిలో తేడా
నల్ల ద్రాక్ష తీపి, రుచికరంగా ఉంటుంది. రంగు ఆకర్షణీయంగా ఉండటంతో చాలా మంది ఇష్టపడతారు. మరొకవైపు పచ్చ ద్రాక్ష క్రంచీగా ఉండి పుల్లని రుచిని ఇస్తుంది.
పోషకాలు
నల్ల ద్రాక్ష ఎక్కువగా రెడ్ వైన్ తయారీలో, ఆకుపచ్చ ద్రాక్ష వైట్ వైన్ తయారీలో ఉపయోగిస్తారు. పోషకాల పరంగా రెండు రకాల ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అయితే నల్ల ద్రాక్షలో ఆంథోసైనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్షలో విటమిన్ K, పొటాషియం ఎక్కువగా ఉన్నాయి.
మొత్తం మీద ఏ ద్రాక్ష తినాలన్నది మీ రుచిపై ఆధారపడి ఉంటుంది. కొందరికి నల్ల ద్రాక్ష ఇష్టం, మరికొందరికి పచ్చ ద్రాక్ష ఇష్టం. రెండు రకాలూ తింటే ఆరోగ్యానికి మేలు. క్యాన్సర్‌ను నిరోధించడంలో, గుండె జబ్బులను తగ్గించడంలో ద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ద్రాక్షలోని పోషకాలు కండరాలకు ఉపశమనం కలిగించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనానికి ద్రాక్షను తరచూ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.