
చిత్తూరు నాగయ్య నటించిన యోగి వేమన సినిమా గుర్తుందా. ఆ సినిమాలో తన స్నేహితుడు అభిరామయ్యతో కలిసి వేమన.. పురాతన పద్దతులను ఉపయోగించి ఒక బంగారు కడ్డీని తయారు చేస్తారు. సినిమాలో అలా చూపించారు గానీ.. నిజంగా వేమన బంగారాన్ని సృష్టించాడా లేదా అన్న దానికి నేటికీ రుజువులు లేవు. ఒకవేళ తయారు చేసి ఉంటే.. ఇప్పటికీ ఆ విద్య ఉండే ఉండాలిగా అన్నది ఒక ప్రశ్న. వేమన పుట్టి ఇప్పటికి 600 ఏళ్లు దాటింది. ఆ కాలంలో అలాంటి విద్య ఉండేదని, దాన్ని పరుసవేది లేదా రసవేది విద్య అంటారని చెబుతుంటారు. కేవలం వేమన మాత్రమే కాదు.. న్యూటన్ సైతం ఈ విద్యను నమ్మాడు. న్యూటన్ పుట్టి 300 ఏళ్లు దాటింది. ఆ కాలంలోనే బంగారం తయారు చేయొచ్చని నమ్మి ప్రయోగాలు చేశారంటే.. ఆ విద్య ఉన్నట్టే అనుకోవాలా లేక ఇదొక పుకారుగా ప్రపంచం అంతా పాకిందనుకోవాలా? ఇది పుకారు అయితే కాదు అనే వాళ్లు బోలెడు మంది ఉన్నారు. కారణమేంటంటే.. గ్రీకులు, రోమన్ల కాలంలో కూడా బంగారాన్ని పుట్టించే ప్రయోగాలు చేశారు. ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నగరంలో బంగారాన్ని సృష్టించే పెద్దపెద్ద ప్రయోగ కేంద్రాలు ఉండేవి. ఆ కాలంలోనే భారత ఉపఖండంలోనూ, చైనాలోనూ ప్రయోగశాలలు ఉండేవనడానికి రుజువులు కూడా ఉన్నాయి. సో, ఇది పుకారు కాదు అనడానికి ఇదొక్కటే సాక్ష్యం.
ఇక క్రీస్తుశకం 10వ శతాబ్దంలో.. బౌద్ధ గురువులైన సిద్ధ నాగార్జునుడు, సిద్ధ నిత్యానందుడు పాదరసం నుంచి బంగారం తయారు చేయడం సాధ్యం అని గట్టిగా నమ్మారు. వాళ్లు చేసిన ప్రయోగాలను ‘రసేంద్ర మంగళం’, ‘రసరత్నాకరం’ అనే గ్రంథాల్లో చాలా క్లియర్‌గా రాశారు కూడా. బంగారం, పాదరసం మధ్య చాలా దగ్గరి సంబంధం ఉందని అప్పట్లోనే ఎలా కనిపెట్టారా అనేది ఇప్పటికీ అంతుపట్టని విషయమే. ఎందుకంటే.. పీరియాడిక్ టేబుల్లో బంగారం, పాదరసం పక్కపక్కనే ఉంటాయి. పీరియాడిక్ టేబుల్‌ను సృష్టించింది మహా అయితే ఓ 200 ఏళ్ల క్రితమే. అది కూడా.. సంస్కృతం, భారతీయ గ్రంథాల్లోని సమాచారం ఆధారంగా పీరియాడిక్ టేబుల్లో మూలకాలను పేర్చారని చెబుతుంటారు. ఈ లెక్కన బౌద్ధ గురువులు బంగారాన్ని సృష్టించారనడానికి, వేమనకు సైతం పరుసవేది విద్య వచ్చని చెప్పడానికి ఓ లింక్ ఉన్నట్టే. యోగి వేమన రసవేది విద్యను నేర్చుకుని, బంగారం తయారు చేశాక.. ఆ రహస్యాన్ని ఆయన పద్యాల్లో నిక్షిప్తం చేశాడన్న ప్రచారం కూడా ఉంది. దాన్ని డీకోడ్ చేయడానికి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. ‘ఉప్పు చింతకాయ ఊరిలోనుండగ.. కరువదేల వచ్చు కాంతలారా’ అనే పద్యాన్ని డీకోడ్ చేయడానికి తెగ ప్రయత్నించారని చెబుతుంటారు.
వేమన సంగతేమో గానీ.. సిద్ధ నాగార్జునుడు, సిద్ధ నిత్యానందుడు పాదరసం నుంచి బంగారం తయారు చేయొచ్చని చెప్పిన మాటపై ప్రయోగాలు జరిగాయి. జరగడమే కాదు.. బంగారాన్ని సృష్టించారు కూడా. పీరియాడిక్ టేబుల్లో బంగారం, పాదరసం పక్కపక్కనే ఉంటాయి. బంగారం పరమాణు సంఖ్య 79, పాదరసం పరమాణు సంఖ్య 80. అంటే.. పాదరసం పరమాణువులోని 80వ ప్రోటాన్‌ను తీసేయగలిగితే అది బంగారంగా మారుతుంది. ఇది తెలుసుకున్న శాస్త్రవేత్తలు 1941లో పాదరసం పరమాణువుల్లోని 80వ ప్రోటాన్‌ను తొలగించారు. అలా బంగారాన్ని సృష్టించగలిగారు. అంటే.. పరుసవేది విద్య నిజమేనన్న మాట. మరెందుకని ఇప్పుడు తయారుచేయట్లేదు అలా అంటే.. ల్యాబ్‌లో బంగారాన్ని భారీగా తయారు చేసేంత సీన్ లేదు. దానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. గోరంత బంగారాన్ని తయారుచేయాలన్నా సరే.. ఒక న్యూక్లియర్ రియాక్టర్ అంతటి భారీ పరిమాణంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. దీనికంటే గనుల్లోంచి బంగారాన్ని తవ్వుకోవడమే ఎంతో చౌక.
పాదరసం నుంచి బంగారాన్ని సృష్టించడం సాధ్యమయ్యాక.. మరిన్ని ప్రయోగాలు జరిగాయి. నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్.. 1980లో బిస్మత్ నుంచి బంగారాన్ని తయారు చేశాడు. బిస్మత్ అంటే సీసం. ఈ సీసం పరమాణు సంఖ్య 83. సో, సీసం పరమాణువుల్లోని ప్రోటాన్లను తొలగించి, దాన్ని బంగారంగా మార్చగలిగాడు. ఇది కూడా భారీ ఖర్చుతో కూడుకున్నదే. అంతేకాదు.. ఈ ప్రక్రియలో ఒక గ్రాము బంగారం తయారుచేయడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈ ప్రాసెస్ పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. కాకపోతే.. ఇప్పుడు చేస్తున్న ప్రయోగాల రీతిలో కాకుండా ఇంకా ఏదో సింపుల్ మెథడ్ ఉండే ఉంటుందని నమ్మేవాళ్లున్నారు. వేమన ఏకంగా బంగారు కడ్డీని తయారు చేశాడంటే.. ఏదో ఒక తేలిక దారి ఉండే ఉంటుందన్నది చాలామంది నమ్మకం.
పరుసవేది అనే పదం ఇప్పటి తరానికి అర్థం కాకపోవచ్చు. కెమిస్ట్రీ లాంగ్వేజ్‌లో దీన్నే అల్కెమిస్ట్ అంటారు. ఒకప్పుడు ఈజిప్ట్, మెసొపటేమియా, పర్షియా, చైనా, జపాన్, కొరియా, గ్రీక్, రోమన్, యూరప్ దేశాల్లో ఈ రసాయన శాస్తవ్రేత్తలు బంగారాన్ని తయారుచేయడానికి తెగ ప్రయత్నించారు. కాకపోతే ఆ పద్దతులు దారితప్పాయి. మార్మిక విద్యగా మారి రకరకాల మోసాలు జరిగేవి. నకిలీ బంగారం, నకిలీ వెండిని అంటగట్టడం పెరిగిపోయింది. దీంతో ఇలాంటి అల్కెమిస్ట్ పద్దతులను నిషేధించారు. బట్.. మోడర్న్ సైంటిస్టులు మాత్రం దీనిపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మరి.. ఎలా సక్సెస్ అవుతారో చూడాలి.